OTT Releases: ఓటీటీలో చూడాల్సిన 6 బెస్ట్ సినిమాలు.. తృప్తి దిమ్రి బోల్డ్ మూవీ నుంచి అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్ వరకు!
Top 6 OTT Movies Release: ఓటీటీలోకి ఈ నెలలో అదిరిపోయే సినిమాలు రానున్నాయి. వాటిలో చూడాల్సిన 6 బెస్ట్ సినిమాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. వాటిలో యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి బోల్డ్ కామెడీ మూవీ విద్యా కా వో వాలా వీడియో నుంచి అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్ జిగ్రా, డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ వరకు ఉన్నాయి.
(1 / 7)
OTT Releases This Week: నవంబర్ నెలలో అద్భుతమైన ఓటీటీ సినిమాలు రానున్నాయి. పండుగ సీజన్ తర్వాత కూడా ఎంటర్టైన్మెంట్ కొనసాగుతుందని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వివిధ రకాల సినిమాలను రిలీజ్ చేస్తూ చెబుతున్నాయి.
(Netflix, Disney, YouTube)(2 / 7)
Khwaabon Ka Jhamela OTT: "ఖ్వాబోన్ కా ఝమేలా" మూవీ తన కాబోయే భర్త తిరస్కరించిన తరువాత యుకెకు వెళ్లే జుబిన్ కథతో ఉంటుంది. ఇందులో సయానీ గుప్తా, ప్రతీక్ బబ్బర్, కుబ్రా సేఠ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జియో సినిమాలో నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
(Jio Cinema)(3 / 7)
Deadpool And Wolverine OTT: "డెడ్ పూల్ అండ్ వోల్వరైన్" మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్ 12 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. డెడ్ పూల్‌గా పిలువబడే వేడ్ విల్సన్, వోల్వరైన్ కలిసి లోకాన్ని ఎలా కాపాడరనే కథతో సైన్స్ ఫిక్షన్, కామెడీ, యాక్షన్, ఫాంటసీ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో చూపించారు.
(YouTube)(4 / 7)
Jigra OTT release: తన సోదరుడిని తప్పుడు కేసు నుంచి కాపాడేందుకు ఎంతగానో శ్రమించే ఓ సోదరి కథే 'జిగ్రా'. ఈ చిత్రంలో అలియా భట్, వేదాంగ్ రైనా, ఆదిత్య నంద తదితరులు నటించారు.నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో త్వరలోనే జిగ్రా ఓటీటీ రిలీజ్ కానుంది. ఇంకా జిగ్రా ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించలేదు.
(X)(5 / 7)
vicky vidya ka woh wala video ott release: విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాలో నవ వధూవరుల ప్రైవేట్ వీడియోతో కూడిన సీడీ చుట్టూ తిరుగుతుంది. అనుకోకుండా ఆ సీడీ కనిపించకుండా పోతుంది. దాంతో వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయన్నదే కథ. బోల్డ్ అండ్ కామెడీ రొమాంటిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు, తృప్తి దిమ్రీ, మల్లికా షెరావత్ తదితరులు మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 6న ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం.
(YouTube)(6 / 7)
Cobra Kai 6 Part 2 OTT: 1984 ఆల్ వ్యాలీ కరాటే టోర్నమెంట్‌కు 34 సంవత్సరాల తరువాత "కోబ్రా కై" చివరి పార్ట్ సరికొత్త కథతో వస్తోంది. కొత్త సీజన్‌లో కోబ్రా కై డోజోను తిరిగి తీసుకురావడంపై ఉండనుంది. ఈ సిరీస్ నవంబర్ 15న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
(Netflix)ఇతర గ్యాలరీలు