Champions Trophy: సచిన్ కాదు.. పాంటింగ్ లేడు.. ఛాంపియన్స్ ట్రోఫీ టాప్-5 పరుగుల వీరులు వీళ్లే.. ఇండియా నుంచి ఇద్దరు
- Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 క్రికెటర్లలో సచిన్ లేడు. ఆసీస్ నుంచి ప్రాతినిథ్యమే లేదు. ఇండియా నుంచి ఇద్దరు క్రికెటర్లున్న ఈ లిస్ట్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది.
- Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 క్రికెటర్లలో సచిన్ లేడు. ఆసీస్ నుంచి ప్రాతినిథ్యమే లేదు. ఇండియా నుంచి ఇద్దరు క్రికెటర్లున్న ఈ లిస్ట్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది.
(1 / 5)
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల వీరుడిగా వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో యూనివర్స్ బాస్ గేల్ 17 మ్యాచ్ ల్లో 52.73 సగటుతో 791 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలున్నాయి.
(X/muffadal_vohra)(2 / 5)
శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనె రెండో స్థానంలో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 21 ఇన్నింగ్స్ ల్లో అతను 41.22 సగటుతో 742 పరుగులు చేశాడు. కానీ ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు.
(x/ICCAsiaCricket)(3 / 5)
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల వీరుల్లో మూడో స్థానం మన శిఖర్ ధావన్ ది. ఈ టోర్నీ చరిత్రలో భారత్ తరపున టాప్ రన్ స్కోరర్ గా ఈ గబ్బర్ కొనసాగుతున్నాడు. అతను 10 ఇన్నింగ్స్ ల్లోనే 77.88 సగటుతో 701 పరుగులు సాధించాడు. మూడు సెంచరీలు కొట్టాడు.
(x/SunRisers)(4 / 5)
ఛాంపియన్స్ ట్రోఫీ టాప్-5 పరుగుల వీరుల్లో శ్రీలంక నుంచి మరో దిగ్గజ ఆటగాడున్నాడు. 21 ఇన్నింగ్స్ ల్లో 37.94 సగటుతో 683 పరుగులు చేసిన సంగక్కర నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో ఓ సెంచరీ ఉంది.
(x/mufaddal_vohra)ఇతర గ్యాలరీలు