తెలుగు న్యూస్ / ఫోటో /
OTT: ఓటీటీలో ఫ్యామిలీతో వీకెండ్‌కు చూడాల్సిన టాప్ 5 సినిమాలు- సన్నీ లియోన్ మూవీ టు బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ వరకు!
OTT Top Movies: ఓటీటీలో ఎప్పటికప్పుడు అదిరిపోయే కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే వీకెండ్‌కు ఫ్యామిలీతో చూసేలా సినిమాలు ఉంటాయి. అలా ఫ్యామిలీతో చూసే టాప్ 5 ఓటీటీ సినిమాలు, వాటి ప్లాట్‌ఫామ్స్ ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
సిటాడెల్: హనీ బన్నీ ఓటీటీ: సమంత రూత్ ప్రభు, వరుణ్ ధావన్ హీరోహీరోయిన్లుగా నటించిన యాక్షన్ ప్యాక్డ్, స్పై థ్రిల్లర్ సిరీస్ ఇది. సిటాడెల్ హనీ బన్నీ అనేది ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ టీవీ సిరీస్ సిటాడెల్‌కు ప్రీక్వెల్ సిరీస్. ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్లతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిందీ, తెలుగు ఇతర భాషల్లో వీక్షించవచ్చు. (Varun Dhawan/ Instagram)
(2 / 5)
డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ ఓటీటీ: ఈ వీకెండ్‌లో మీరు చూడదగ్గ మరో యాక్షన్ కామెడీ చిత్రం డెడ్ పూల్ అండ్ వోల్వరైన్. థియేటర్లలో 11 వేల కోట్లు రాబట్టిన ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. (Disney Plus Hotstar)
(3 / 5)
వేట్టయన్ ఓటీటీ: వేట్టయన్ తమిళ భాష యాక్షన్ డ్రామా చిత్రం ఇందులో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమిళంతోపాటు తెలుగులో వేట్టయన్ అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిమ్మల్ని స్క్రీన్‌కు అతుక్కుపోయేలా చేస్తుంది. (Amazon Prime Video)
(4 / 5)
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ ఓటీటీ: మీరు స్వాతంత్య్ర పోరాటం చుట్టూ తిరిగే సినిమాలు, సిరీస్‌లను చూడటానికి ఇష్టపడితే ఈ వారంలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ మంచి ఎంపిక అవుతుంది. చిరాగ్ వోహ్రా, ఆరిఫ్ జకారియా, ల్యూక్ మెక్ గిబ్నీ, రాజేంద్ర చావ్లా, ఇరా దూబే, సిద్ధాంత్ గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది. (Sony Liv)
(5 / 5)
పేటా ర్యాప్ ఓటీటీ: హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఎంటర్టైనర్ చిత్రంగా వచ్చిన పేటా ర్యాప్ మూవీలో వేదిక, సన్నీ లియోన్, ప్రభుదేవా, కళాభవన్ షాజోన్, భగవతి పెరుమాళ్, వివేక్ ప్రసన్న తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. యాక్షన్ అండ్ మ్యూజికల్ మూవీగా తెరకెక్కిన పేటా ర్యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమకథలను చూసి ఎంజాయ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కావచ్చు. (T-series)
ఇతర గ్యాలరీలు