(1 / 5)
Replica AI : ఇదొక కాన్వర్జేషనల్ ఏఐ చాట్‌బాట్. ఇది మీకు ఒక మంచి ఫ్రెండ్‌గా, పార్ట్నర్గా, గైడ్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా, ఏదైనా మాట్లాడవచ్చు. ఇది మీకు ఎమోషనల్ సపోర్ట్‌ని ఇస్తుంది. ఇందులో ఫ్రీ వర్షెన్, పెయిడ్ వర్షెన్ ఉన్నాయి.
(2 / 5)
Google Socratic : ఇదొక ఫ్రీ ఎడ్యుకేషనల్ ఏఐ యాప్. విద్యార్థులకు తమ హోమ్‌వర్క్‌లో ఇది సాయం చేస్తుంది. ఏదైనా ప్రశ్న అడిగితే స్టెప్ బై స్టెప్ సమాధానం ఇస్తుంది. సోర్స్‌లను కూడా చెబుతుంది. ప్రశ్నలను టైప్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఫొటో తీసి అప్లోడ్ చేస్తే చాలు!
(3 / 5)
ELSA Speak : ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్‌ని మెరుగుపరుచుకోవాలని చూస్తున్న వారికి ఈ ఎల్సా స్పీక్ ఏఐ యాప్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అడ్వాన్స్డ్ స్పీచ్ రికగ్నీషన్, డీప్ ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్‌ని వాడి ఈ యాప్ యూజర్ వాయిస్‌ని ఎనలైజ్ చేసి, రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్‌ని ఇస్తుంది. దీని ద్వారా మీరు మీ ప్రొనన్సియేషన్, ఇంటోనేషన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఫ్రీ, పెయిడ్ వర్షెన్ల్ ఉన్నాయి.
(4 / 5)
Freeletics : ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసే వారికి ఈ ఫ్రీలెటిక్స్ ఏఐ యాప్ ది బెస్ట్! ఇందులో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వర్కౌట్ ప్లాన్స్ ఉంటాయి. ఇది మీకు ఒక పర్సనల్ ట్రైనర్‌గా పనిచేస్తుంది. కార్డియో, స్ట్రంత్ ట్రైనింగ్, స్ట్రెచింగ్ చేయిస్తుంది. ఇది ఫ్రీ! కానీ పెయిడ్ వర్షెన్‌లో మరిన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి.
(5 / 5)
Wysa : ఇదొక మెంటల్ హెల్త్‌కేర్ యాప్. మాడర్న్ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అనేక బిహేవియర్ థెరపీ ఆప్షన్స్‌ని అందిస్తుంది. ఈ ఏఐ యాప్ ద్వారా మీరు మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. డిప్రెషన్ నుంచి బయటకు రావొచ్చు. ఇందులోనూ ఫ్రీ అండ్ పెయిడ్ వర్షెన్లు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు