
(1 / 5)
ఓటీటీల్లో గతవారం ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ నిలిచింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 మధ్య నెట్‌ఫ్లిక్స్ లోని ఈ సిరీస్ కు 3.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

(2 / 5)
నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న శ్రద్ధా శ్రీనాథ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది గేమ్ యు నెవర్ ప్లే అలోన్ వెబ్ సిరీస్ 2.4 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది.

(3 / 5)
బాలీవుడ్ సీనియర్ నటించి కాజోల్ నటించిన ది ట్రయల్ వెబ్ సిరీస్ రెండో సీజన్ మూడో స్థానంలో ఉంది. జియోహాట్‌స్టార్ లో ఉన్న ఈ సిరీస్ కు గత వారం 2.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

(4 / 5)
అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న సిక్సర్ సీజన్ 2 వెబ్ సిరీస్ 2 మిలియన్ వ్యూస్ తో నాలుగో స్థానంలో ఉంది.

(5 / 5)
సోనీ లివ్ ఓటీటీలోని 13th వెబ్ సిరీస్ 1.2 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది. ఆర్మాక్స్ మీడియా ఈ వివరాలను రిలీజ్ చేసింది.
ఇతర గ్యాలరీలు