ఓటీటీలోనూ దుమ్ము రేపుతున్న మహావతార్ నరసింహ.. ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 మూవీస్ ఇవే-top 5 most watched movies on ott netflix prime video jiohostar mahavatar narsimha tops the list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఓటీటీలోనూ దుమ్ము రేపుతున్న మహావతార్ నరసింహ.. ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 మూవీస్ ఇవే

ఓటీటీలోనూ దుమ్ము రేపుతున్న మహావతార్ నరసింహ.. ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 మూవీస్ ఇవే

Published Sep 29, 2025 05:48 PM IST Hari Prasad S
Published Sep 29, 2025 05:48 PM IST

ఓటీటీల్లో గత వారం అంటే సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితా వచ్చేసింది. ఇందులో మహావతార్ నరసింహ టాప్ లో ఉంది. ఇండియాలో కనీసం 30 నిమిషాల పాటు చూసిన యూజర్ల ఆధారంగా ఈ లిస్టును ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది.

థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ మహావతార్ నరసింహ దుమ్ము రేపుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా గత వారం అత్యధిక వ్యూస్ సాధించిన మూవీగా నిలిచింది. 5.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

(1 / 5)

థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ మహావతార్ నరసింహ దుమ్ము రేపుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా గత వారం అత్యధిక వ్యూస్ సాధించిన మూవీగా నిలిచింది. 5.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఈ లిస్టులో రెండో స్థానంలో సయ్యారా మూవీ ఉంది. నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు 4.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

(2 / 5)

ఈ లిస్టులో రెండో స్థానంలో సయ్యారా మూవీ ఉంది. నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు 4.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

మూడో స్థానంలో మోహన్‌లాల్ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ హృదయపూర్వం ఉంది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు గత వారం 3.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

(3 / 5)

మూడో స్థానంలో మోహన్‌లాల్ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ హృదయపూర్వం ఉంది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు గత వారం 3.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలోని రజనీకాంత్ కూలీ సినిమా 3 మిలియన్ల వ్యూస్ తో నాలుగో స్థానంలో ఉంది.

(4 / 5)

అమెజాన్ ప్రైమ్ వీడియోలోని రజనీకాంత్ కూలీ సినిమా 3 మిలియన్ల వ్యూస్ తో నాలుగో స్థానంలో ఉంది.

నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టిన సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా 1.9 మిలియన్ల వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.

(5 / 5)

నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టిన సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా 1.9 మిలియన్ల వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు