Champions Trophy: బౌలింగ్ తో బెంబేలెత్తించిన యోధులు.. ఛాంపియన్స్ ట్రోఫీ టాప్-5 బౌలర్ల లిస్ట్.. ఎవరున్నారో ఓ లుక్కేయండి!-top 5 bowlers in champions trophy history kyle mayers malinga muralidharan brett lee mcgrath ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Champions Trophy: బౌలింగ్ తో బెంబేలెత్తించిన యోధులు.. ఛాంపియన్స్ ట్రోఫీ టాప్-5 బౌలర్ల లిస్ట్.. ఎవరున్నారో ఓ లుక్కేయండి!

Champions Trophy: బౌలింగ్ తో బెంబేలెత్తించిన యోధులు.. ఛాంపియన్స్ ట్రోఫీ టాప్-5 బౌలర్ల లిస్ట్.. ఎవరున్నారో ఓ లుక్కేయండి!

Published Feb 17, 2025 09:05 PM IST Chandu Shanigarapu
Published Feb 17, 2025 09:05 PM IST

  • Champions Trophy: ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో బౌలర్లు అదరగొట్టారు. అద్భుత బౌలింగ్ తో తమ జట్లకు విజయాలు అందించారు. ఈ టోర్నీ చరిత్రలో టాప్-5 బౌలర్ల లిస్ట్ ఇదే. 

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు న్యూజిలాండ్ మాజీ పేసర్ కైల్ మిల్స్ పేరు మీద ఉంది. 15 ఇన్నింగ్స్ ల్లో అతను 17.25 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. 

(1 / 5)

(x/cricbuzz)

శ్రీలంక పేస్ దిగ్గజం మలింగ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా కొనసాగుతున్న ఈ యార్కర్ కింగ్ 16 ఇన్నింగ్స్ ల్లో 25 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 

(2 / 5)

(x/mipaltan)

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో టాప్-5 వికెట్ల వీరుల్లో ఉన్న ఏకైక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. మూడో స్థానంలో ఉన్న ఈ శ్రీలంక స్పిన్ మాంత్రికుడు 15 ఇన్నింగ్స్ ల్లో 20.16 సగటుతో 24 వికెట్లు పడగొట్టాడు.  

(3 / 5)

(x/ICC)

ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ బ్రెట్ లీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఉత్తమ ప్రదర్శన చేశాడు. అతను 15 ఇన్నింగ్స్ ల్లో 22 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. లీ సగటు 26,86గా ఉంది. 

(4 / 5)

(x/Rowan_predict)

పేస్ లెజెండ్ గ్లెన్ మెక్ గ్రాత్ 12 ఇన్నింగ్స్ ల్లో 21 వికెట్లు సంపాదించాడు. ఈ ఆస్ట్రేలియా మాజీ పేసర్ సగటు 19.61గా ఉంది. ఇంగ్లండ్ పేస్ దిగ్గజం అండర్సన్ కూడా 12 ఇన్నింగ్స్ ల్లో 21 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 

(5 / 5)

(x/bhindiigoshtt)

Chandu Shanigarapu

eMail
WhatsApp channel

ఇతర గ్యాలరీలు