తెలుగు న్యూస్ / ఫోటో /
Free OTT: ఓటీటీలో ఫ్రీగా చూసే టాప్ 10 వెబ్ సిరీసులు- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- బోల్డ్ నుంచి క్రైమ్ థ్రిల్లర్స్ వరకు!
Top 10 OTT Web Series To Watch Free In MX Player Telugu: ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు చూడాలంటే డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ, ఎలాంటి రుసుము లేకుండా ఈ ఓటీటీలో టాప్ 10 వెబ్ సిరీసులును ఫ్రీగా చూసేయొచ్చు. మరి ఆ వెబ్ సిరీస్‌లు, ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో లుక్కేద్దాం.
(1 / 8)
ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులను వీక్షించాలంటే డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, అలాంటి చెల్లింపులు ఏది లేకుండా ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో టాప్ 10 హిందీ వెబ్ సిరీసులను ఫ్రీగా చూసేయొచ్చు. అంతేకాకుండా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న అన్ని రకాల జోనర్స్ గల ఆ ఓటీటీ వెబ్ సిరీసులు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
(2 / 8)
Gutar Gu OTT: ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఫ్రీగా చూసే టాప్ 2 వెబ్ సిరీస్ గుటర్ గు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు 8.3 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉండటం విశేషం.
(3 / 8)
Aashram OTT: యానిమల్ విలన్ బాబీ డియోల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ ఆశ్రమ్. రెండు సీజన్లుగా అలరిస్తోన్న ఈ వెబ్ సిరీస్‌ను ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఫ్రీగా తెలుగులో చూడొచ్చు.
(4 / 8)
Campus Beats OTT: ఐఎమ్‌డీబీ నుంచి 7 రేటింగ్ ఉన్న యూత్‌ఫుల్ రొమాంటింక్ వెబ్ సిరీస్ క్యాంపస్ బీట్స్‌ను ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. ఇది ఇప్పటికీ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది.
(5 / 8)
Highway Love OTT: హై లవ్ కూడా రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్. 7.4 రేటింగ్ ఉన్న హైవే లవ్ సిరీస్‌ను ఎంఎక్స్ ప్లేయర్‌లో ఫ్రీగా వాచ్ చేయొచ్చు.
(6 / 8)
Dharavi Bank OTT: ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఫ్రీగా చూసే క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ధారావి బ్యాంక్. దీనికి 7.6 ఎండీబీ రేటింగ్ ఉంది.
(7 / 8)
Raktanchal OTT: రెండు సీజన్లతో ఉన్న యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రక్తాంచల్‌ను ఉచితంగా ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో వీక్షించవచ్చు.
(8 / 8)
Ishq In The Air OTT: బోల్డ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన ఇష్క్ ఇన్ ది ఎయిర్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో టాప్ 1 వాచబుల్ సిరీస్‌గా నిలిచింది. దీనికి ఐఎమ్‌డీబీ నుంచి 8.1 రేటింగ్ ఉండటం విశేషం. ఈ ఏడింటితోపాటు భౌకల్, నామ్ నమక్ నిషాన్, ఫిసద్దీ వెబ్ సిరీస్‌లు కూడా టాప్‌లో ఉన్నాయి. ఇలా మొత్తంగా ఈ టాప్ 10 వెబ్ సిరీసులన్నింటిని ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో తెలుగులో ఫ్రీగా చూసేయొచ్చు.
ఇతర గ్యాలరీలు