
(1 / 11)
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన సోనీ లివ్ లో 10 అత్యధిక IMDb రేటింగ్ పొందిన సినిమాలు ఇక్కడ ఇస్తున్నాం. ఈ జాబితాలో సౌత్ సినిమాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
(IMDb)
(2 / 11)
కదాసి వివాసాయి - ఈ జాబితాలో మొదటి స్థానంలో తమిళ డ్రామా మూవీ కదాసి వివాసాయి ఉంది. ఈ సినిమా 2022లో విడుదలైంది. ఈ సినిమాకు ఎం.మణికందన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 8.7గా ఉంది.
(IMDb)
(3 / 11)
పారాసైట్ - ఈ జాబితాలో రెండవ స్థానంలో దక్షిణ కొరియా మూవీ పారాసైట్ ఉంది. ఈ చిత్రం 2021లో విడుదలైంది. ఇది బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ. నాలుగు ఆస్కార్ లను కూడా గెలుచుకుంది. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 8.5.
(IMDb)
(4 / 11)
2018 ఎవరిబడీ ఈజ్ ఎ హీరో - మలయాళ మూవీ 2018 ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. కేరళలో 2018లో సంభవించిన వరదల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 8.3 ఉంది.
(IMDb)
(5 / 11)
ఇట్లు అమ్మ - తెలుగు క్రైమ్ డ్రామా మూవీ ఇట్లు అమ్మ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ చిత్రానికి సి.ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2021 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 8.2 ఉంది.
(IMDb)
(6 / 11)
మానాడు - మానాడు మూవీ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. ఇది తమిళ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 8.2 ఉంది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు.
(IMDb)
(7 / 11)
బాహుబలి 2: ది కంక్లూజన్ - ప్రభాస్ నటించిన 'బాహుబలి 2: ది కంక్లూజన్' ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం 2017 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 8.2 ఉంది.
(IMDb)
(8 / 11)
గార్గి: తమిళ థ్రిల్లర్ డ్రామా గార్గి ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం 2022 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 8.1 ఉంది.
(IMDb)
(9 / 11)
బాహుబలి: ది బిగినింగ్ - బాహుబలి: ది బిగినింగ్ ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఈ చిత్రం 2015 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 8 ఉంది.
(IMDb)
(10 / 11)
పోర్‌తోళిల్ - తమిళ థ్రిల్లర్ మూవీ పోర్‌తోళిల్ ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ చిత్రం 2023 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 8 ఉంది.
(IMDb)
(11 / 11)
సౌదీ వెల్లక్క - ఈ జాబితాలో 10వ స్థానంలో మలయాళ మూవీ సౌదీ వెల్లక్క ఉంది. ఈ చిత్రం 2022 సంవత్సరంలో విడుదలైంది. జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 8 ఉంది.
(IMDb)ఇతర గ్యాలరీలు