మార్చి 23, రేపటి రాశి ఫలాలు.. ఈ వీకెండ్ ఏ రాశి వారికి శుభవార్త అందుతుందో తెలుసా?
- Tomorrow 23 March Horoscope: మార్చి 23 శని త్రయోదశి వచ్చింది. శనీశ్వరుడు ఎవరికి అండగా నిలిచి ఐశ్వర్యాన్ని ఇచ్చాడో చూద్దాం.
- Tomorrow 23 March Horoscope: మార్చి 23 శని త్రయోదశి వచ్చింది. శనీశ్వరుడు ఎవరికి అండగా నిలిచి ఐశ్వర్యాన్ని ఇచ్చాడో చూద్దాం.
(2 / 13)
మేషం: ఈ రాశివారు తమ పనిని సకాలంలో పూర్తి చేయలేరని ఆందోళన చెందుతారు, దీని కారణంగా వారు ఒత్తిడికి గురవుతారు. వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్యలకు సంబంధించి మీరు కొన్ని అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. మీ భార్య మీ గురించి చెడుగా భావించవచ్చు. డబ్బు వ్యవహారాలను ఇంట్లోనే పరిష్కరించుకోవడం మంచిది. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
(3 / 13)
వృషభం: ఆర్థిక పరిస్థితికి సంబంధించి కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవచ్చు, ఇది వారి ఆదాయాన్ని పెంచుతుంది. మీరు పోగొట్టుకున్న వస్తువులు దొరుకుతాయి. స్నేహితుల్లో ఒకరి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు.
(4 / 13)
మిథునం: పనిలో ఏ నిర్ణయమైనా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కుటుంబ సమస్యలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా జాగ్రత్తగా ప్రాపర్టీ డీల్‌ను ఖరారు చేయాలి. పనిలో ప్రశంసలు పొందవచ్చు. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వొద్దు.
(5 / 13)
కర్కాటకం: ఈ రాశి వారికి రేపు మిశ్రమంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసే ప్రయత్నంలో బిజీగా ఉంటారు. సామాజిక రంగంలో పనిచేసే వ్యక్తుల స్థాయి, హోదా పెరుగుతుంది. అప్పులు ఇస్తే తిరిగి డబ్బులు పొందటం చాలా కష్టం.విద్యార్థులు ఒత్తిడి నుంచి బయట పడతారు.
(6 / 13)
సింహం: ఎవరి సలహా మేరకు ఏ పథకంలోనూ డబ్బు పెట్టుబడి పెట్టకండి.పిల్లల భవిష్యత్ కోసం జీవిత భాగస్వామితో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. మిమ్మల్ని చూసి అసూయ పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
(7 / 13)
కన్య: శారీరక సమస్యల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారులకు ఈ రోజు కొంత హెచ్చు తగ్గులు రావచ్చు. పిక్నిక్ కి వెళతారు. వ్యాపారాన్ని దీర్ఘకాలికంగా ప్లాన్ చేయడం ప్రారంభిస్తారు. ఇంతకు ముందు షేర్ మార్కెట్‌లో డబ్బును ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని నుండి మంచి లాభాలను పొందుతారు.
(8 / 13)
తుల: రేపు మీకు చాలా ఫలప్రదం కానుంది. విద్యార్థులు ఇతర పనులతో పాటు చదువుల కోసం తగినంత సమయాన్ని వెచ్చించాలి. ఏదైనా మతపరమైన వేడుకలో పాల్గొంటారు. కొంత ఆస్తి కొనుగోలు మీకు మేలు చేస్తుంది. జీవిత భాగస్వామి నుండి ఏదైనా రహస్యంగా ఉంచినట్లయితే అది తరువాత గొడవలకు దారి తీస్తుంది.
(9 / 13)
వృశ్చికం: ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. స్వభావం కొంచెం చికాకుగా ఉంటుంది, ఇది మీ భాగస్వాములకు చికాకు కలిగించవచ్చు. వ్యాపార ప్రణాళికలో మంచి మొత్తంలో పెట్టుబడి పెడతారు. మీరు ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. సోదరులు, సోదరీమణుల సలహాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
(10 / 13)
ధనుస్సు: రేపు ధనుస్సు రాశి వారికి లావాదేవీల విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ కష్టార్జితంతో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. చెప్పుడు మాటలు వినొద్దు. మీ ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి.
(11 / 13)
మకరం: రేపు చాలా బిజీగా గడుపుతారు. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తుల విశ్వసనీయత ప్రతిచోటా వ్యాపిస్తుంది. మీరు ఏదైనా మతపరమైన వేడుకలో కూడా పాల్గొనవచ్చు. కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలు ఈరోజు మళ్లీ మొదటికొస్తాయి.
(12 / 13)
కుంభం: రేపు మిశ్రమ రోజుగా ఉంటుంది. ఫ్రెండ్స్ తో పార్టీకి వెళతారు. పనికి ప్రశంసలు దక్కుతాయి. విదేశాలకు వెళ్లాలని అనుకున్న వారి కోరికలు నెరవేరుతాయి. స్నేహితుల నుండి పూర్తి మద్దతు పొందుతారు.
ఇతర గ్యాలరీలు