(1 / 5)
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే భారత దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‍ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా చిరంజీవిని సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‍కుమార్ కూడా చేరారు.
(Photo: X (Twitter))(2 / 5)
బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి మరీ నేడు (ఫిబ్రవరి 4) చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పారు శివ రాజ్‍కుమార్. పద్మవిభూషణ్ దక్కించుకున్న చిరూను అభినందించారు.
(3 / 5)
ఈ ఫొటోలను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు చిరంజీవి. “బెంగళూరు నుంచి వచ్చి మరీ నాకు శుభాకాంక్షలు చెప్పారు నా ప్రియమైన శివ రాజ్‍కుమార్. ఇది నా హృదయాన్ని హత్తుకుంది. లంచ్ కోసం కలిసి కాస్త సమయం గడిపాం. మా బంధాన్ని, దిగ్గజం రాజ్‍కుమార్, వారి కుటుంబంతో చాలా జ్ఞాపకాల గురించి మాట్లాడుకున్నాం” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
(4 / 5)
చిరంజీవి, శివ రాజ్‍కుమార్ కలిసి లంచ్ చేశారు. తన ఇంట్లో చిరూ ఆయనకు ఆతిథ్యమిచ్చారు.
(5 / 5)
చిరంజీవికి, రాజ్‍కుమార్ కుటుంబానికి మధ్య స్నేహపూర్వక బంధం చాలా కాలంగా ఉంది. ఈ విషయాన్ని గతంలోనూ కొన్ని సందర్భాల్లో మెగాస్టార్ చెప్పారు.
ఇతర గ్యాలరీలు