(1 / 5)
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి పుట్టిన రోజు నేడు (జనవరి 29). ఈ సందర్భంగా తన తల్లి పుట్టిన రోజును ఇంట్లో సెలెబ్రేట్ చేశారు చిరంజీవి.
(2 / 5)
కేక్ కట్ చేసి చిరంజీవికి తినిపించారు అంజనా దేవి. మెగాస్టార్ భార్య సురేఖతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఈ సెలెబ్రేషన్లలో ఉన్నారు.
(3 / 5)
ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. “కనిపించే దేవత, కని.. పెంచిన అమ్మకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు చిరూ.
(4 / 5)
మెగాస్టార్ చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.
(5 / 5)
పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకున్న చిరంజీవిని చాలా మంది సినీ ప్రముఖులు కలిసి అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. టీమిండియా క్రికెటర్, తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ నేడు చిరంజీవిని కలిసి కంగ్రాచులేషన్స్ తెలిపారు. తన జెర్సీని గుర్తుగా అందించారు. ఇక, మెగాస్టార్ చిరూ ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు