TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై సందేహాలు, ఫిర్యాదులా..? టోల్ ఫ్రీ నెంబర్ ఇదే..!
- TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. ప్రాథమిక జాబితాలు విడుదల కాగా... అసలైన అర్హులను ఎంపిక చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ స్కీమ్ కు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలు రిజిస్ట్రర్ చేసుకునేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ను తీసుకువచ్చింది.
- TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. ప్రాథమిక జాబితాలు విడుదల కాగా... అసలైన అర్హులను ఎంపిక చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ స్కీమ్ కు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలు రిజిస్ట్రర్ చేసుకునేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ను తీసుకువచ్చింది.
(1 / 8)
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండలాల్లోని ఒక గ్రామంలో లబ్ధిదారులను గుర్తించారు. ఈ మేరకు కొందరికి ప్రోసీడింగ్స్ కాపీలను అందజేశారు. ఇక అన్ని గ్రామాలకు సంబంధించిన జాబితాలపై కసరత్తు జరుగుతోంది.
(2 / 8)
మార్చి 31 లోపు తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్ లో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులను గుర్తించనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
(3 / 8)
ఇప్పటికే అన్ని గ్రామాలకు సంబంధించి ప్రాథమిక జాబితాలు వచ్చాయి. ఇందులో అర్హత ఉన్న పేర్లను గుర్తించారు. అయితే వీటిపై మరోసారి అధికారులు సర్వే చేయనున్నారు. అంతేకాకుండా… కొత్తగా కూడా ప్రజాపాలన - గ్రామసభ కార్యక్రమాల్లో దరఖాస్తులు వచ్చాయి. వీటిని కూడా పరిశీలించనున్నారు.
(4 / 8)
పాత,కొత్త దరఖాస్తులను పరిశీలించి… తుది జాబితాలను ప్రకటించనున్నారు. ఇందుకు మార్చి 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హత జాబితాలో ఉన్న పేర్లను ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి… స్కీమ్ కు ఎంపిక చేస్తారు.
(5 / 8)
ప్రాథమిక జాబితాలు విడుదలైన నేపథ్యంలో పలు గ్రామాల్లో కొందరు ఆందోళనకు దిగుతున్నారు. అర్హత ఉన్నా తమ పేర్లు లేదని కొందరు చెబుతున్నారు. మరికొన్నిచోట్ల అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు, సమస్యలను నమోదు చేసుకోవటంతో పాటు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
(6 / 8)
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి సందేహాలు నివృత్తి చేయడం, ఫిర్యాదుల స్వీకరణ కోసం 040-29390057 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుపొచ్చు.
(7 / 8)
ప్రభుత్వం తీసుకువచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ అన్ని పని దినాల్లో పని చేస్తుంది. ఇదే కాకుండా కొన్ని జిల్లాల కలెక్టరేట్లలో కూడా ప్రత్యేక నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
(8 / 8)
ఫిర్యాదులను రాతపూర్వకంగా https://indirammaindlu.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి కూడా పంపొచ్చు. అంతేకాకుండా ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. మొబైల్ నెంబర్ లేదా ఆదార్ లేదా పుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి మీ వివరాలను తెలుసుకునే వీలు ఉంటుంది.
ఇతర గ్యాలరీలు