ఈరోజు కామిక ఏకాదశి.. పాపముల నుంచి విముక్తి పొందే రోజు
Kamika Ekadashi 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు (13 జూలై 2023) కామికా ఏకాదశి. దీనినే సర్వైకాదశి అంటారు. అదేవిధంగా చాతుర్మాస కాలంలో మొదటి ఏకాదశి కూడా. ఈ రోజున నిత్యం శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల అనేక భయాలు, ఆందోళనలు తొలగిపోతాయని నమ్మకం.
(1 / 6)
ఆషాఢ కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున కామిక ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈసారి కామికా ఏకాదశి వ్రతాన్ని జూలై 13న పాటించనున్నారు. ఇది చాతుర్మాస తొలి ఏకాదశి. శ్రీమహావిష్ణువు చాతుర్మాస సమయంలో 4 నెలల పాటు యోగా నిద్రలో ఉంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఉపవాసం ఉంటారు.
(2 / 6)
కామిక ఏకాదశి యొక్క శుభ సమయం హిందూ పంచాంగం ప్రకారం 12 జూలై 5.59 నుండి ప్రారంభమవుతుంది. ఈరోజు (జూలై 13) సాయంత్రం 6.24 గంటలకు ముగుస్తుంది. రేపు ద్వాదశి రోజు ఉదయం తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉపవాస దీక్ష ముగించవచ్చు.( unsplash /raimond-klavins-)
(3 / 6)
కామికా ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత: కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం క్రమం తప్పకుండా విష్ణువును పూజించడం వల్ల వ్యక్తికి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున తులసీ మాతను పూజించాలి. దానధర్మాలకు విశేషమైన పుణ్యఫలం ఉంటుంది.
(4 / 6)
కామిక ఏకాదశి వ్రతానికి సంబంధించిన కథ: కామిక ఏకాదశి వ్రతం రోజున ఏకాదశి వ్రత కథ చదవాలి. లేదా వినాలి. అది లేకుండా ఉపవాసం అసంపూర్ణంగా పరిగణిస్తారు. కామికా ఏకాదశి వ్రతానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ ఇక్కడ చదవండి. ఒక క్రోధ స్వభావం గల గ్రామాధికారి ఒక గ్రామంలో నివసించేవాడు. ఒకరోజు కోపంతో ఒక దుష్టుడిని చంపుతాడు. దీని వల్ల అతనికి బ్రహ్మహత్యా పాపం అంటుకుంటుంది. దానికి ప్రాయశ్చిత్తం కోరుకుంటాడు.
(5 / 6)
ఒక ఋషిని కలిసిన గ్రామపెద్ద.. దుష్టుడిని చంపడానికి, ప్రాయశ్చిత్తం పొందడానికి మార్గమేమిటని అడుగుతాడు. అప్పుడు ఋషి ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి కామికా ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని సలహా ఇస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయి అని రుషి చెబుతాడు.
ఇతర గ్యాలరీలు