WhatsApp Chat | మీ వాట్సాప్ చాటింగ్ ఎవరికీ కనిపించకుండా దాచేయాలా? ఇదిగో ట్రిక్!
మీరు చేసిన వాట్సాప్ చాటింగ్ మీ వద్దే ఉండాలి, కానీ ఎవరికీ కనిపించకూడదు అనుకుంటున్నారా? WhatsAppలో యూజర్లు తమకు కావాల్సిన చాట్‌లను దాచుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.
మీరు చేసిన వాట్సాప్ చాటింగ్ మీ వద్దే ఉండాలి, కానీ ఎవరికీ కనిపించకూడదు అనుకుంటున్నారా? WhatsAppలో యూజర్లు తమకు కావాల్సిన చాట్‌లను దాచుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 7)
iPhone లేదా Androidలో WhatsApp ఉపయోగించే యూజర్లు ఎవరైనా తమ వాట్సాప్ చాట్‌లను దాచుకోవచ్చు. మీరు వేటినీ డిలీట్ చేయాల్సిన పనిలేదు. బదులుగా WhatsApp దాని వినియోగదారులకు ఆర్కైవ్ చాట్ ఫీచర్‌ను అందిస్తుంది. దీంతో మీరు ఒక వ్యక్తితో చేసిన చాట్ లేదా గ్రూప్ చాట్‌ను ఆర్కైవ్ చేయవచ్చు. ఇవి కనిపించవు, మెసేజ్ వస్తే మీకు వీటి నోటిఫికేషన్ కూడా రాదు.
(Bloomberg)
(2 / 7)
ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగిస్తుంటే.. చాట్స్ ట్యాబ్‌లో ఒక వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌ను ఆర్కైవ్ చేయడానికి, మీరు దాచాలనుకుంటున్న ఆ చాట్‌ను నొక్కి పట్టుకోండి. ఆపై స్క్రీన్ ఎగువన ఆర్కైవ్ నొక్కండి.
(Reuters)(3 / 7)
(4 / 7)
ఆర్కైవ్ చేసిన వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్‌లను తిరిగి చూడాలంటే చాట్స్ స్క్రీన్ పైభాగానికి స్క్రోల్ చేయండి. ఆపై ఆర్కైవ్‌ని నొక్కండి. మీకు వెంటనే అక్కడ ఆ గ్రూప్ లేదా వ్యక్తిగత చాట్ కు సంబంధించి చదవని సందేశాలు ఎన్ని ఉన్నాయో సూచిస్తుంది.
(Pixabay)(5 / 7)
మీరు ఐఫోన్‌లో WhatsApp వినియోగిస్తుంటే. వ్యక్తిగత చాట్ లేదా గ్రూప్ చాట్ ను ఆర్కైవ్ చేయడానికి- చాట్స్ ట్యాబ్‌లో మీరు ఆర్కైవ్ చేయాలనుకుంటున్న చాట్ లేదా గ్రూప్‌లో ఎడమవైపుకు స్వైప్ చేయండి. ఆపై ఆర్కైవ్ నొక్కండి. మీకు WhatsApp సెట్టింగ్‌లు > చాట్‌లు > అన్ని చాట్‌లను ఆర్కైవ్ చేయడానికి సంబంధించి ఎంపికలు కనిపిస్తాయి.
(Pixabay)(6 / 7)
ఐఫోన్‌లో మీరు ఆర్కైవ్ చేసిన చాట్‌లు లేదా గ్రూప్ లను వీక్షించడానికి- చాట్స్ ట్యాబ్ పైకి స్క్రోల్ చేయండి. ఆర్కైవ్ చేసిన చాట్‌లపై క్లిక్ చేయండి.
(Pixabay)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు