Vaikunta Dwara Darshanam : తిరుమల, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు-శరవేగంగా ఏర్పాట్లు
Tirumala Vaikunta Dwara Darshanam : వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులు తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
(1 / 6)
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులు తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
(2 / 6)
టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, బారీకేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
(3 / 6)
వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతి, తిరుమలలో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి... జనవరి 9వ తేదీ ఉదయం 5 నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారు.
(4 / 6)
తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
(5 / 6)
అదేవిధంగా జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు... ఏ రోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
(6 / 6)
టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేశామని వెల్లడించారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. అదేవిధంగా చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు టీటీడీ రద్దు చేసింది.
ఇతర గ్యాలరీలు