Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, మే నెల కోటా దర్శనం టికెట్ల షెడ్యూల్ విడుదల
Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లపై అప్డేట్ వచ్చింది. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో మే నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
(1 / 6)
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లపై అప్డేట్ వచ్చింది. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో మే నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
(2 / 6)
ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు లక్కీడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనున్నారు.
(3 / 6)
ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టిక్కెట్లు విడుదల చేయనున్నారు. అదే రోజు 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల అవుతాయి. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.
(4 / 6)
ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల అవుతాయి. 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్, టీటీడీ దేవస్థానం యాప్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
(5 / 6)
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 09 నుండి 13వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ తేదీల్లో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 09, 10వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
(6 / 6)
తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 09న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండో రోజు మార్చి 10న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు. మూడో రోజు మార్చి 11న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 12న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 13వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఇతర గ్యాలరీలు