Tirumala Leopard : తిరుమల శ్రీవారి మెట్టు వద్ద చిరుత కలకలం, భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
- Tirumala Leopard : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతను చూసినట్లు భక్తులు తెలిపారు. చిరుత సంచారంపై టీటీడీ సిబ్బందికి భక్తులు సమాచారం అందించారు. శ్రీవారి మెట్టు సమీపంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడానికి టీటీడీ అటవీ శాఖ చర్యలు చేపట్టాయి.

(1 / 6)
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతను చూసినట్లు భక్తులు తెలిపారు. చిరుత సంచారంపై టీటీడీ సిబ్బందికి భక్తులు సమాచారం అందించారు.
(2 / 6)
తిరుమల శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గరకు చిరుత రాగా, కుక్కలు దాని వెంటపడ్డాయి. చిరుతను చూసిన భక్తులు సెక్యూరిటీ గార్డుకి సమాచారం ఇచ్చారు. అతడు భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నాడు.
(3 / 6)
శ్రీనివాసమంగాపురం నుంచి శ్రీవారిమెట్టుకు భక్తులను గుంపులుగా వెళ్లాలని టీటీడీ సిబ్బంది సూచిస్తున్నారు. కాలినడక వస్తున్న భక్తులను గుంపులుగా వదులుతున్నారు.
(4 / 6)
సెక్యూరిటీ గార్డు సైతం చిరుత సంచారంపై టీటీడీ అధికారులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. శ్రీవారి మెట్టు సమీపంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడానికి టీటీడీ అటవీ శాఖ చర్యలు చేపట్టాయి.
(5 / 6)
తిరుమలలో చిరుతపులి సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో అలిపిరి మార్గంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద కొన్ని చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించిన విషయం తెలిసిందే.
ఇతర గ్యాలరీలు