Tirumala Srivari Laddu : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- హైదరాబాద్ లో రోజూ తిరుమల లడ్డూలు విక్రయం, ఎక్కడంటే?
- Tirumala Srivari Laddu : తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలంటే భక్తులకు ఎంతో ఇష్టం. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు లడ్డూలు కొనుగోలు చేస్తారు. శ్రీవారి లడ్డూలు ఇకపై హైదరాబాద్ లో ప్రతి రోజూ విక్రయించనున్నట్లు టీటీడీ తెలిపింది.
- Tirumala Srivari Laddu : తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలంటే భక్తులకు ఎంతో ఇష్టం. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు లడ్డూలు కొనుగోలు చేస్తారు. శ్రీవారి లడ్డూలు ఇకపై హైదరాబాద్ లో ప్రతి రోజూ విక్రయించనున్నట్లు టీటీడీ తెలిపింది.
(1 / 6)
తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలంటే భక్తులకు ఎంతో ఇష్టం. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు లడ్డూలు కొనుగోలు చేస్తారు. భక్తులు ఎంతో ఇష్టపడే శ్రీవారి లడ్డూలను అడ్డదారిలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దళారీలు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
(2 / 6)
హైదరాబాద్ లో భక్తులకు శ్రీవారి లడ్డూలను అందుబాటులోకి తెచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు వారంలో ఒక రోజు మాత్రమే శ్రీవారి లడ్డూలు అందుబాటులో ఉండేవి. ఇకపై అన్ని రోజులు తిరుమల లడ్డూలు అందుబాటులోకి తేవాలని టీటీడీ నిర్ణయించింది. ఈ విషయాన్ని హిమాయత్నగర్టీటీడీ దేవాలయం ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, నిరంజన్ ప్రకటించారు.
(4 / 6)
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకునే భక్తులు దళారులను ఆశ్రయించకుండా హైదరాబాద్ లోని టీటీడీ ఆలయాలలో పొందవచ్చని అధికారులు తెలిపారు. దీంతో పాటు సమాచార కేంద్రాల్లో లడ్డూల విక్రయాలు ప్రారంభించినట్లు తెలిపారు.
(5 / 6)
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, అప్పలయాగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా తిరుమల శ్రీవారి లడ్డూలు విక్రయిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు