Tirumala Laddu Adulteration : తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం, టీటీడీ కీలక నిర్ణయం-మూడ్రోజుల పాటు మహాశాంతి యాగం-tirumala laddu adulteration ttd key decision perform maha sakthi yagam for three days ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tirumala Laddu Adulteration : తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం, టీటీడీ కీలక నిర్ణయం-మూడ్రోజుల పాటు మహాశాంతి యాగం

Tirumala Laddu Adulteration : తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం, టీటీడీ కీలక నిర్ణయం-మూడ్రోజుల పాటు మహాశాంతి యాగం

Sep 21, 2024, 05:15 PM IST Bandaru Satyaprasad
Sep 21, 2024, 05:15 PM , IST

  • Tirumala Laddu Adulteration : తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారం కారణంగా సంప్రోక్షణకు శ్రీకారం చుట్టింది.

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కల్తీ నెయ్యి శ్రీవారి ప్రసాదంలో వినియోగించారని కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.  

(1 / 6)

కలియుగ దైవం వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల అవశేషాల నుంచి తీసిన కొవ్వును వినియోగించినట్లు ఎన్‌డీడీబీ ఇటీవల నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం కీలక ప్రకటన చేసింది. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారం కారణంగా సంప్రోక్షణకు శ్రీకారం చుట్టింది. 

(2 / 6)

తిరుమలలో మూడు రోజుల పాటు మహా శాంతియాగం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి ఆనంద నిలయంలో మహా శాంతియాగం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నారు. ఆ యాగంలో వేద పండితులతోపాటు రుత్వికులు పాల్గొనున్నారు.

(3 / 6)

తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో సమావేశమై.... ఆలయం సంప్రోక్షణపై చర్చించారు. ప్రధాన అర్చకుడు, పండితులతో ఈవో చర్చలు జరిపారు. లడ్డూ వివాదంపై నివేదికను టీటీడీ ఈవో...సీఎం చంద్రబాబును కలిసి అందజేయనున్నారు. కల్తీ వివాదం, నెయ్యి కొనుగోలు, ఇతర విషయాలను సీఎంకు వివరించనున్నారు.

(4 / 6)

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వాడే నెయ్యికి టెండర్లు పిలిచారు. గతంలో టీటీడీకి నెయ్యి సప్లై చేసిన కర్ణాటకకు చెందిన నందినీ సంస్థ ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొంది. అయితే ఆవు నెయ్యి కేజీ కేవలం రూ. 320గా సప్లై చేస్తామని చెప్పిన మరో కంపెనీకి ఈ టెండర్‌‌ను టీటీడీ ఖరారు చేశారు. ఈ నెయ్యి నాసిరకంగా ఉందని టీటీడీ సిబ్బంది సైతం పలుమార్లు చెప్పినట్లు సమాచారం. 

(5 / 6)

 ఏపీలో కూటమి సర్కార్ రావడంతో టీటీడీలో అధికారులు మారారు. కొత్త ఈవో రాగానే తిరుమల లడ్డూకు వినియోగిస్తున్న నెయ్యిను గుజరాత్ కు చెందిన ఎన్‌డీడీబీ ల్యాబ్ కు పంపి పరీక్షించారు. ఈ నివేదికలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెయ్యి తయారీలో జంతువుల అవశేషాల నుంచి తీసిన కొవ్వును వినియోగించినట్లు నిర్థారణ అయ్యింది.   

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు