ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలా? రేపటి నుంచే వివిధ టికెట్లు జారీ-tirumala darshan in august 2025 ticket release dates ttd announced ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలా? రేపటి నుంచే వివిధ టికెట్లు జారీ

ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలా? రేపటి నుంచే వివిధ టికెట్లు జారీ

Updated May 18, 2025 03:17 PM IST Bandaru Satyaprasad
Updated May 18, 2025 03:17 PM IST

ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా...అయితే మీకోసమే ఈ విషయం. తిరుమల శ్రీవారి ఆగస్టు నెల కోటా దర్శనం, గదుల టికెట్ల బుకింగ్ టీటీడీ ప్రకటన చేసింది. మే 19 నుంచి 29 మధ్య వివిధ దర్శన టికెట్లు జారీ చేయనున్నారు.

ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా...అయితే మీ కోసమే ఈ విషయం. తిరుమల శ్రీవారి ఆగస్టు నెల కోటా దర్శనం, గదుల టికెట్ల బుకింగ్ టీటీడీ ప్రకటన చేసింది.

(1 / 6)

ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా...అయితే మీ కోసమే ఈ విషయం. తిరుమల శ్రీవారి ఆగస్టు నెల కోటా దర్శనం, గదుల టికెట్ల బుకింగ్ టీటీడీ ప్రకటన చేసింది.

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను మే 19 ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన వారు మే 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.

(2 / 6)

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను మే 19 ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన వారు మే 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.

మే 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల ప‌విత్రోత్సవాల‌ టికెట్లను మే 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. 22న వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

(3 / 6)

మే 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల ప‌విత్రోత్సవాల‌ టికెట్లను మే 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

22న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

23న‌ అంగప్రదక్షిణం టోకెన్లుఆగ‌స్టు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాశ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

(4 / 6)

23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు

ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.


వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటావ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా  ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

(5 / 6)

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా

ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌  తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 29న శ్రీవారి సేవా కోటా విడుదలశ్రీవారి సేవ(తిరుమల, తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జులై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్, టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

(6 / 6)

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌

తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

29న శ్రీవారి సేవా కోటా విడుదల

శ్రీవారి సేవ(తిరుమల, తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జులై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్, టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు