వైభవంగా శ్రీవారి చక్రస్నానం, నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు-tirumala brahmotsavam 2023 chakrasnanam in pushkarini large number of devotees attended ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Tirumala Brahmotsavam 2023 Chakrasnanam In Pushkarini Large Number Of Devotees Attended

వైభవంగా శ్రీవారి చక్రస్నానం, నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

Sep 26, 2023, 02:00 PM IST Bandaru Satyaprasad
Sep 26, 2023, 02:00 PM , IST

  • శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగ‌ళ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగ‌ళ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

(1 / 10)

మంగళవారం తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. 

(2 / 10)

ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

(3 / 10)

స్నపనతిరుమంజనంలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

(4 / 10)

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. 

(5 / 10)

అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమ‌ల పెద్దజీయ‌ర్‌స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి శిష్యబృందం పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. శ్రీ‌వారి ఆల‌య ప్రధాన అర్చకులు రామ‌కృష్ణ దీక్షితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది.

(6 / 10)

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలు సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం చేస్తారు. ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.

(7 / 10)

చక్రస్నానం రోజున సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు.  

(8 / 10)

మంగవారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.

(9 / 10)

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు 

(10 / 10)

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు