AP TS Weather Updates : మే 24 వరకు వానలే..! ఇవాళ హైదరాబాద్ కు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్ష సూచన
- Telangana AP Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఏపీ, తెలంగాణలో వానలు పడనున్నాయి. ఇక హైదరాబాద్ లో ఇవాళ ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది.తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana AP Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఏపీ, తెలంగాణలో వానలు పడనున్నాయి. ఇక హైదరాబాద్ లో ఇవాళ ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది.తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
(1 / 7)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు కురిసే అవకాశం ఉంది.
(@APSDMA Twitter)(2 / 7)
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం… శనివారం(మే 18) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మ లాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబనగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(photo source https://unsplash.com/)(3 / 7)
ఇక ఇవాళ(మే 18) హైదరాబాద్ వాతావరణ చూస్తే... నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంది.
(photo source https://unsplash.com/)(4 / 7)
ఇవాళ హైదరాబాద్ లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
(photo source https://unsplash.com/)(5 / 7)
తెలంగాణలో మే 24వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(photo source https://unsplash.com/)(6 / 7)
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ(AP Disaster Management Authority) ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు.
(photo source https://unsplash.com/)(7 / 7)
మే 18వ తేదీన అల్లూరి సీతారామ రాజు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మరియు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
(@APSDMA Twitter)ఇతర గ్యాలరీలు