(1 / 7)
రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.
(2 / 7)
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. 2 దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.
(3 / 7)
పీఎం కిసాన్ కింద జూన్ 20వ తేదీన ఒక్కో రైతు కుటుంబానికి రూ.2వేల చొప్పున విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో సుఖీభవ డబ్బులను కూడా జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.5వేల చొప్పున జమచేయనుంది. అంటే తొలి విడతలో రైతులకు రూ.7వేలు అందుతాయి.
(4 / 7)
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికారులు మరో కీలక అప్డేట్ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పధకాన్ని పొందాలనుకునే రైతులు తప్పకుండా థంబ్ అథంటిఫికేషన్ ( Thumb Authentication) తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.
(5 / 7)
ఓటీపీ ద్వారా నమోదు చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. కేవలం Thumb Authentication ఆధారంగా మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పధకానికి అర్హత పొందాలంటే… రైతు సేవా కేంద్రం వద్ద ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
(6 / 7)
Thumb Authentication నమోదు చేయని రైతులకు స్కీమ్ వర్తింపు కాదని హెచ్చరిస్తున్నారు. అన్ని అర్హతలున్న వారు… సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పథకం కింద లబ్ధి పొందగలుగుతారని స్పష్టం చేస్తున్నారు.
(7 / 7)
అన్నదాత సుఖీభవ స్కీమ్ స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.
ఇతర గ్యాలరీలు