హీరోయిన్‌కు కమల్ హాసన్ లిప్ కిస్, అదిరిపోయిన యాక్షన్- కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ రివ్యూ ఫొటోలు-thug life trailer review in telugu kamal haasan lip kiss to abirami trisha beautiful looks simbu impress with action ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హీరోయిన్‌కు కమల్ హాసన్ లిప్ కిస్, అదిరిపోయిన యాక్షన్- కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ రివ్యూ ఫొటోలు

హీరోయిన్‌కు కమల్ హాసన్ లిప్ కిస్, అదిరిపోయిన యాక్షన్- కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ రివ్యూ ఫొటోలు

Published May 18, 2025 12:42 PM IST Sanjiv Kumar
Published May 18, 2025 12:42 PM IST

థగ్ లైఫ్ ట్రైలర్ రివ్యూ: కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది. మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ ట్రైలర్‌లో హీరోయిన్ పెదాలను ముద్దాడి కమల్ హాసన్ లిప్ కిస్ పెట్టడం, యాక్షన్ సీన్స్ హైలెట్‌‌గా నిలిచాయి. మరి థగ్ లైఫ్ ట్రైలర్ రివ్యూ ఫొటోలపై లుక్కేస్తే..!

థగ్ లైఫ్ ట్రైలర్ రివ్యూ: కమల్ హాసన్, శింబు నటించిన సినిమా థగ్ లైఫ్. మే 17న థగ్ లైఫ్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  కొంతమంది అభిప్రాయం ప్రకారం ఇటీవల విడుదలైన ట్రైలర్లలో ఇది బెస్ట్ అని అంటున్నారు. మరికొందరు మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూసిన ఫీలింగ్ కలుగుతుందని మరికొందరు చెప్పారు.

(1 / 10)

థగ్ లైఫ్ ట్రైలర్ రివ్యూ: కమల్ హాసన్, శింబు నటించిన సినిమా థగ్ లైఫ్.

మే 17న థగ్ లైఫ్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొంతమంది అభిప్రాయం ప్రకారం ఇటీవల విడుదలైన ట్రైలర్లలో ఇది బెస్ట్ అని అంటున్నారు. మరికొందరు మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూసిన ఫీలింగ్ కలుగుతుందని మరికొందరు చెప్పారు.

థగ్ లైఫ్ ట్రైలర్ హాలీవుడ్ సినిమాలా అనిపిస్తుందని నెటిజన్స్ అంటున్నారు. ట్రైలర్‌లో అద్భుతమైన విజువల్స్, ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి.

(2 / 10)

ఇక థగ్ లైఫ్ ట్రైలర్ ఓ చిన్నారితో కమల్ హాసన్ సంభాషణ మొదలవుతుంది. 'నువ్ నా ప్రాణాలు కాపాడావ్. యుముడి నుంచి నన్ను వెనక్కి లాగావ్. మనిద్దరి తలరాత ఒక్కటే' అని కమల్ హాసన్ అన్నారు. తండ్రీకొడుకుల అనుబంధం ఎమోషనల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉందని తెలుస్తోంది.

(3 / 10)

థగ్ లైఫ్‌లో కమల్ హాసన్ లాగే సిలంబరసన్ టి.ఆర్ (శింబు) కూడా పవర్ ఫుల్ రోల్‌లో కనిపించాడు. కాస్తా నెగెటివ్ షేడ్స్‌లో శింబు ఉన్నట్లు తెలుస్తోంది.

(4 / 10)

థగ్ లైఫ్ ట్రైలర్‌లో హీరోయిన్ అభిరామితో కమల్ హాసన్ లిప్ లాక్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. అభిరామి, కమల్ హాసన్ భార్యాభర్తలుగా నటించినట్లు తెలుస్తోంది.  ‌అలాగే, త్రిషతో కూడా కమల్ హాసన్ రొమాన్స్ చేసే సన్నివేశాలు ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ ముగ్గురి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

(5 / 10)

కథలోని ప్రాథమిక సంఘర్షణను ట్రైలర్‌లో స్పష్టంగా వివరించారు. కొడుకు, తండ్రి మధ్య జరిగే యుద్ధంగా థగ్ లైఫ్ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో త్రిష చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. రెడ్ సారీలో స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఇలా అందంగా దర్శనం ఇచ్చింది త్రిష.

(6 / 10)

హీరో, విలన్ పాత్రలకు సమాన అవకాశాలు ఇస్తూ టి.ఆర్., కమల్ హాసన్‌ల మధ్య భీకర ముఖాముఖి ఫైట్‌ను చూపించారు. అందులో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. కమల్ హాసన్, శింబు ఇద్దరు సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసినట్లు తెలుస్తోంది.

(7 / 10)

ఇక ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచింది. యాక్షన్, ఎమోషన్, రొమాంటిక్ సన్నివేశాల్లో బీజీఎమ్ అట్రాక్ట్ చేసింది.

(8 / 10)

ఏదేమైనా అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. థగ్ లైఫ్ మూవీ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని నెటిజన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

(9 / 10)

జూన్ 5న థగ్ లైఫ్ మూవీ విడుదల కానుంది. తమిళంతో పాటు కన్నడ, తెలుగు, హిందీ తదితర భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

(10 / 10)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు