తెలుగు న్యూస్ / ఫోటో /
Throat Pain: చలికాలంలో గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి
- Home Remedies for Throat Pain: చలికాలంలో గొంతునొప్పి సహజం సాధారణం. దీని నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి కొన్ని రెమెడీలను పాటించండి.
- Home Remedies for Throat Pain: చలికాలంలో గొంతునొప్పి సహజం సాధారణం. దీని నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి కొన్ని రెమెడీలను పాటించండి.
(1 / 6)
చలికాలం మొదలైందంటే జలుబు, దగ్గు వచ్చేస్తాయి. అలాగే గొంతునొప్పి కూడా వేధిస్తుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నిత్యం మందులు వాడడం మంచి పద్దతి కాదు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. (Freepik)
(2 / 6)
ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటితో పుక్కిలించండి. చలికాలంలో గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి సమస్యను దూరం చేసుకోవచ్చు.(Freepik)
(3 / 6)
ప్రతిరోజూ ఉదయం ఒక టీస్పూన్ తేనెలో 2-3 తులసి ఆకుల రసాన్ని వేసి తినాలి.ఇది గొంతు నొప్పి సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.(Freepik)
(4 / 6)
వేడి నీళ్లలో వస్త్రాన్ని ముంచి, పిండి దాన్ని గొంతు పై కప్పాలి. చల్లని గాలి తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో చెవులు మూసి ఉంచేలా చూసుకోవాలి.(Freepik)
(5 / 6)
గొంతు నొప్పి ఉంటే, రోజూ గోరువెచ్చని నీటిని తాగండి. ఇది గొంతులో ఇన్ఫెక్షన్‌ని తొలగించి సమస్యను తగ్గిస్తుంది. (Freepik)
ఇతర గ్యాలరీలు