తెలుగు న్యూస్ / ఫోటో /
కార్లకు కొత్త రూల్స్.. త్రీ పాయింట్ సీట్ బెల్టులు తప్పనిసరి !
- భారత్‌లో కొత్త వాహనల నాణ్యతను తనిఖీ చేయడం కోసం నూతన సేఫ్టీ రేటింగ్ సిస్టమ్ అభివృద్ధి చేయనున్నట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీని కోసం న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్(ఎన్‌సీఏపీ) వ్యవస్థను తీసుకొస్తున్నట్లు వివరించారు.

(1 / 5)
వాహనా సేప్టీ విషయంలో కేంద్రం కఠిన నిబంధనల అమలుకు చర్యలు చెపట్టింది. ప్యాసింజర్ వాహనాలలో ఆరు ఎయిర్ బ్యాగులతో పాటు త్రీ పాయింట్ సీట్ బెల్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ (AEBS) సహా ఇతర ఫీచర్లు తప్పనిసరితో చేయనున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు.(Reuters)
(2 / 5)
ఇకపై నుంచి కారులో ప్రయాణించే వారందరికి సీట్ బెల్ట్ తప్పనిసరి చేయనున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నప్పుడు హెచ్చరించే వ్యవస్థ, ప్రమాదకరమైన రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు అలర్ట్ చేయడం. లైన్స్ మిస్ అవ్వకుండా డ్రైవింగ్ సాఫీగా కొనసాగేందుకు ఓ సిస్టమ్‌ను అమలుచేయనున్నట్లు మంత్రి తెలిపారు.(PTI)
(3 / 5)
ప్రస్తుతం భారత్ రోడ్డు భద్రతా వ్యవస్థ చాలా వెనుకబడి ఉందని నితిన్ గడ్కరీ అంగీకరించారు. ఈ ఏడాది ఆటోమొబైల్ రక్షణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.(PTI)
(4 / 5)
ప్రస్తుతం, భారతదేశంలో భద్రతా రేటింగ్ వ్యవస్థ లేదు. దేశంలో ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు అరికట్టే దిశగా కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు గడ్కరీ తెలిపారు.(PTI)
ఇతర గ్యాలరీలు