తెలుగు న్యూస్ / ఫోటో /
Cucumber: వేసవిలో కీరాదోసకాయను తినాల్సిన పద్ధతి ఇది
- Cucumber: కీరా దోసకాయ ఆరోగ్యానికి మంచిది. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో ఇదీ ఒకటి. దీనిలో 70 శాతం నీరే ఉంటుంది. కీరా దోసకాయ వేసవిలో ఎలా తినాలో చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
- Cucumber: కీరా దోసకాయ ఆరోగ్యానికి మంచిది. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో ఇదీ ఒకటి. దీనిలో 70 శాతం నీరే ఉంటుంది. కీరా దోసకాయ వేసవిలో ఎలా తినాలో చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
(1 / 7)
కీరదోసకాయ భారతదేశంలోనే పుట్టిందని పరిశోధకులు చెబుతున్నారు. మొదట హిమాలయ ప్రాంతాల్లో కనిపించిన ఈ దోసకాయ… ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని పరిశోధకులు చెబుతున్నారు.
(2 / 7)
కీరదోసకాయలో 100 గ్రాములకు 15 కేలరీలు, 3 నుండి 3.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.5 నుండి 1 గ్రాముల ఫైబర్ ఉంటాయి.
(3 / 7)
ఇందులో 16 మి.గ్రా విటమిన్ కె, 3 మి.గ్రా విటమిన్ సి ఉంటాయి. కీరదోసకాయలో 60 నుండి 70 శాతం నీటి కంటెంట్ కూడా ఉంటుంది, కాబట్టి వేసవిలో కీరదోసకాయను తీసుకోవడం వల్ల సోడియం, పొటాషియం వంటి పోషకాలు అందుతాయి.
(4 / 7)
కీరదోసకాయ తినేటప్పుడు చాలా మంది చేసే పొరపాట్లలో ఒకటుంది. అదేంటంటే… చాలా మంది దేశవాళీ కీరదోసకాయకు దూరంగా ఉండి, హైబ్రిడ్ కీరాదోసకాయను తింటారు. కీరోదోసకాయ మీద ఉన్న తొక్క చేదుగా ఉంటుందని తొక్క తీసిన తర్వాత తింటారు.
(5 / 7)
తొక్కను తొలగించడం వల్ల అందులో ఉండే చాలా విటమిన్లు మన శరీరానికి అందవు. విటమిన్ కె, పొటాషియం వంటి ఖనిజాలను కూడా కోల్పోతాము.
(6 / 7)
కీరదోసకాయలో కుకుర్బిట్ అసిన్ అనే పోషకం ఉంటుంది. ఇది శరీరంలోని అంతర్గత గాయాలను నయం చేస్తుంది. కాబట్టి కీరదోసకాయను తొక్కతో కలిపి తింటేనే పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు.
ఇతర గ్యాలరీలు