66.5 కేజీల గోల్డ్- 295 కేజీల వెండి.. ఈ గణపతి చాలా రిచ్!
- గణేశ్ చతుర్థి వేడుకలకు మహారాష్ట్ర సిద్ధమైంది. ముఖ్యంగా ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ రూపొందించిన విగ్రహం ఈసారి వార్తల్లో నిలిచింది. ఇది.. దేశంలోనే అతి సంపన్నమైన విగ్రహం అని చెబుతున్నారు. కారణం ఏంటంటే..

(1 / 5)
66.5 కేజీల బంగారం ఆభరణాలు, 295 కేజీల వెండితో పాటు ఇతర విలువైన వస్తువులను గణేశ్ విగ్రహానికి అలకరించింది జీఎస్బీ సేవా మండల్. ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రజల తరలివెళుతున్నారు.(@nehalshahbjp/twitter)
(2 / 5)
ముంబై కింగ్స్ సర్కిల్లో ఉంటుంది ఈ మండపం. దీనికి 69ఏళ్ల చరిత్ర ఉంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లి గణేశుడిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి భారీ భద్రతా ఏర్పాట్లే చేశారు. ఫేషియల్ రికగ్నీషన్ సిస్టెమ్ను పెట్టారు.(@Nehalshahbjp/twitter)
(3 / 5)
ఈ ఏడాది.. రూ. 360.4 కోట్లు విలువ చేసే బీమాను తీసుకుంది జీఎస్బీ సేవా మండల్. భక్తుల కోసం క్యూఆర్ కోడ్ని కూడా ఏర్పాటు చేసింది.(@Nehalshahbjp/twitter)
(4 / 5)
ఇక గణేశ్ చతుర్థి వేడుకల కోసం ముంబై సిద్ధమైంది. నగరంవ్యాప్తంగా 2,729 గణేశ్ మండపాలు వెలిశాయి.
ఇతర గ్యాలరీలు