(1 / 9)
నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎనిమిది నుంచి ఎనభై వరకు అన్ని వయస్సులవారు రోజూ కనీసం ఒక చెంచా నెయ్యిని ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ మీకు తెలుసా, నెయ్యి చర్మానికి కూడా చాలా మంచిది. ఇది తేమను అందిస్తుంది. చర్మం ముడతలు పడకుండా కూడా రక్షిస్తుంది. ప్రకాశాన్ని ఇస్తుంది.
(2 / 9)
నెయ్యి నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా చర్మం పొడిబారిన వారు చర్మంపై నెయ్యిని మసాజ్ చేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
(3 / 9)
నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చర్మంపై ముడతల సమస్యతో బాధపడేవారికి నెయ్యి ఎంతో మేలు చేస్తుంది. చర్మంపై నెయ్యిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
(4 / 9)
నెయ్యి చర్మానికి నేచురల్ గ్లో ని అందిస్తుంది. రెగ్యులర్ గా వాడటం వల్ల చర్మం చాలా వైబ్రెంట్ గా కనిపిస్తుంది.
(5 / 9)
మొటిమల సమస్యలతో బాధపడేవారు కూడా నెయ్యిని వాడొచ్చు. ఎందుకంటే నెయ్యిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడుతాయి.
(6 / 9)
చాలామందికి కళ్ల కింద ముడతలు, డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయి. వీటిని వదిలించుకోవడానికి నెయ్యి సహాయపడుతుంది.
(7 / 9)
చాలా మంది నల్లటి పెదవి సమస్యలతో బాధపడుతుంటారు. వారు పెదవులపై నెయ్యి కూడా రాసుకోవచ్చు. పగిలిన పెదాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పెదవులకు సహజ రంగు వస్తుంది.
(8 / 9)
(9 / 9)
పొడి పసుపుతో నెయ్యి మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని ముఖానికి పట్టించి, 5-10 నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత ముఖం కడుక్కోవాలి.
ఇతర గ్యాలరీలు