(1 / 6)
ప్రపంచంలోని అత్యంత అందమైన బంధాలలో స్నేహం ఒకటి. అయితే, ఇతర బంధాల మాదిరిగానే స్నేహం కూడా ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్, గౌరవం, నమ్మకం, విధేయత అనే పునాదులపై కొనసాగాలి.
(Unsplash)(2 / 6)
ఏ బంధంలోనైనా పరస్పర గౌరవం ముఖ్యం. ఎంత ప్రాణ స్నేహితులైనా సరే.. అవమానించడం, తక్కువ చేసి మాట్లాడడం, అగౌరవంగా వ్యవహరించడం ఆమోదనీయం కాదు.
(Unsplash)(3 / 6)
నమ్మకం, విశ్వాసం ఉన్న చోట మాత్రమే స్నేహం సహా ఏ బంధం అయినా నిలుస్తుంది. మన నమ్మకాన్ని తరచుగా దెబ్బ తీస్తున్నారంటే, మన స్నేహం పట్ల వారికి గౌరవం లేదని అర్థం.
(Unsplash)(4 / 6)
జోక్స్ వేయడం, ఆటపట్టించడం స్నేహితుల మధ్య సహజమే. కానీ, అవి హద్దులు మీరకూడదు. ఆ స్నేహితుడిని బాధ పెట్టేలా అవి ఉండకూడదు.
(Unsplash)(5 / 6)
మన మాటకు, అభిప్రాయానికి గౌరవం ఇవ్వని స్నేహానికి దూరంగా ఉండడమే మంచింది. నీ అభిప్రాయాన్ని గౌరవించని వ్యక్తులు.. నీ స్నేహానికి కూడా గౌరవం ఇవ్వరు.
(Unsplash)(6 / 6)
ఏక పక్షంగా వ్యవహరిస్తూ, ఎదుటి వ్యక్తి చెప్పే విషయాలపై ఎలాంటి ఆసక్తి చూపని వారితో స్నేహం అనవసరం. వన్ సైడెడ్ ఫ్రెండ్ షిప్ తో బాధే మిగులుతుంది.
(Unsplash)ఇతర గ్యాలరీలు