కొత్త సంవత్సరం వేళ ఈ మూడు రాశులకు ఎక్కువ అదృష్టం.. ధన లాభాలు, సంతోషం దక్కుతుంది!
- కొత్త సంవత్సరం తొలి రెండు రోజులు మూడు రాశుల వారికి అదృష్టం బాగా కలిసి రానుంది. ముఖ్యంగా ధనపరంగా ఎక్కువ లాభాలు ఉండొచ్చు. చంద్రుడి సంచారం వల్ల ఇది జరగనుంది. ఆ వివరాలు ఇవే..
- కొత్త సంవత్సరం తొలి రెండు రోజులు మూడు రాశుల వారికి అదృష్టం బాగా కలిసి రానుంది. ముఖ్యంగా ధనపరంగా ఎక్కువ లాభాలు ఉండొచ్చు. చంద్రుడి సంచారం వల్ల ఇది జరగనుంది. ఆ వివరాలు ఇవే..
(1 / 5)
చంద్రుడి సంచారం రాశులపై ప్రభావం చూపుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం, రాశుల మధ్య చంద్రుడు వేగంగా కదులుతుంటాడు. కొత్త సంవత్సరం తొలి రోజు చంద్రుడు రాశి మారనున్నాడు.
(2 / 5)
2025 జనవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు చంద్రుడు.. మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 3వ తేదీ ఉదయం 10 గంటల 47 నిమిషాల వరకు అదే రాశిలో ఉంటాడు. దీనివల్ల కొత్త సంవత్సరం వేళ తొలి రెండు రోజుల పాటు మూడు రాశుల వారికి బాగా లాభించనుంది.
(pixabay)(3 / 5)
వృశ్చికం: ఈ రెండు రోజులు వృశ్చిక రాశి వారికి అదృష్టం మెండుగా ఉంటుంది. ధనపరంగా ఎక్కువ ప్రయోజనాలు కలగొచ్చు. సంతోషం అధికం అవుతుంది. వ్యాపారులకు కలిసి వస్తుంది. కుటుంబం, స్నేహితులతో సమయం సంతోషంగా గడుపుతారు.
(4 / 5)
ధనస్సు: లక్ష్మీ నారాయణ యోగకాలంలో ధనస్సు రాశి వారు పురోగతి సాధించగలరు. ధనం ఎక్కువగా దక్కే ఛాన్స్ ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. పాత సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
(5 / 5)
వృషభం: మకరంలో చంద్రుడు ఉండే కాలం వృషభ రాశి వారికి లక్ ఎక్కువగా ఉంటుంది. చేసే పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ధనపరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా విధాలుగా సానుకూలతలు ఉంటాయి. కుటుంబంలోని ఆనందం ఉంటుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)
ఇతర గ్యాలరీలు