(1 / 5)
బుధుడు ప్రస్తుతం ఉత్తర భాద్రపద నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అయితే, ఈనెల చివరి వారంలో నక్షత్రం మారనున్నాడు. గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడి నక్షత్రం మార్పు వల్ల రాశులపై ఎఫెక్ట్ పడనుంది.
(Canva)(2 / 5)
ఈ నెల చివరి వారం ఏప్రిల్ 27వ తేదీన రేవతి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశిస్తాడు. మే 7వ తేదీ వరకు అదే నక్షత్రంలో సంచరిస్తాడు. రేవతి నక్షత్రంలో బుధుడు సంచరించే కాలం మూడు రాశుల వారికి లక్‍ను, లాభాలను కలుగజేస్తుంది.
(3 / 5)
వృషభం: రేవతి నక్షత్రంలో బుధుడు సంచరించే కాలం వృషభ రాశి వారికి అదృష్టం మద్దతు ఎక్కువ. అందుకే చాలా విషయాల్లో పరిస్థితులు కలిసి వస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉంటే తొలగిపోవచ్చు. స్నేహితుల సపోర్ట్ కూడా బాగా లభిస్తుంది. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యంపై మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.
(4 / 5)
కర్కాటకం: ఈ కాలంలో కర్కాటక రాశి వారికి ప్రయోజనాలు మెండుగా కలుగుతాయి. లక్ సపోర్ట్ ఉండడం వల్ల చాలా పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. మానసికంగా సంతోషం కలుగుతుంది. కొత్త పనులు చేసేందుకు ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులకు ధనపరమైన ప్రయోజనాలు ఉంటాయి.
(5 / 5)
ధనూ రాశి: రేవతి నక్షత్రంలో బుధుడు సంచరించే కాలం ధనూ (ధనస్సు) రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారరంగంలో ఉండే వారికి పురోగతి, ఉద్యోగస్తులకు ప్రశంసలు లభిస్తాయి. గౌరవం ఎక్కువగా దక్కుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం రూపొందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాలను తీర్చుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు