(1 / 5)
కుజుడు (అంగారకుడు) మే 12వ తేదీన నక్షత్రం మారనున్నాడు. ఆశ్లేష నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. మే 12 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఆశ్లేష నక్షత్రంలో కుజుడు సంచరిస్తాడు. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి అదృష్టం, ప్రయోజనాలు ఎక్కువగా కలుగుతాయి.
(Pixabay)(2 / 5)
తుల: ఆశ్లేష నక్షత్రంలో కుజుడు సంచరించే కాలం తులారాశి వారికి శుభప్రదం. ఈ కాలంలో వీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు కాలం కలిసి వస్తుంది. అన్నింటా అదృష్టం కలుగుతుంది. కుటుంబంలో ఏవైనా గొడవలు ఉంటే పరిష్కారం అవుతాయి.
(3 / 5)
మకరం: ఈ కాలంలో మకర రాశి వారికి కూడా మేలు జరుగుతుంది. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మనశ్శాంతి కలుగుతుంది. వ్యాపారులు, ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కొన్ని తీరిపోవచ్చు.
(4 / 5)
వృషభం: ఆశ్లేషలో కుజుడి సంచారం వల్ల వృషభ రాశి వారికి కొన్ని లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మానసిక ఆనందం ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు, ఒప్పందాలు దక్కే ఛాన్స్ ఉంటుంది. ప్రేమలో ఉన్న వారికి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి.
(5 / 5)
మిథునం: ఆశ్లేష నక్షత్రంలో కుజుడు సంచరించడం మిథున రాశి వారికి ప్రయోజనకరం. ఈ కాలంలో వీరు కొత్త పనులు మొదలుపెట్టేందుకు సానుకూలంగా ఉంటుంది. వీరికి అదృష్టయోగం బాగా కలిసివస్తుంది. చేసే పనుల్లో ఎక్కువ శాతం సక్సెస్ అవుతాయి. కుటుంబంలో విభేదాలు తొలగిపోయేందుకు ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు