ఈ అరుదైన యోగంతో వీరికి డబ్బు సమస్యలు, ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి!
- Saturn Mars Conjunction : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు మానవ జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు గ్రహాల కలయికలు శుభ లేదా అశుభ యోగాలను సృష్టిస్తాయి. కుజుడు, శని దేవుడు కలిసి షడాష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. ఇది కొన్ని రాశులవారికి ఇబ్బందులను కలిగిస్తుంది.
- Saturn Mars Conjunction : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు మానవ జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు గ్రహాల కలయికలు శుభ లేదా అశుభ యోగాలను సృష్టిస్తాయి. కుజుడు, శని దేవుడు కలిసి షడాష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. ఇది కొన్ని రాశులవారికి ఇబ్బందులను కలిగిస్తుంది.
(1 / 4)
కుజుడు, శని దేవుడు షడాష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. ఈ గ్రహాల కలయిక వల్ల యోగం దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం అన్ని రాశులవారిలోనూ కనిపిస్తున్నప్పటికీ కొన్ని రాశులవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొందరికి ధన నష్టం, ఆరోగ్య సమస్యలు రావచ్చు. శని కుజుడు కలయిక వల్ల జనవరిలో ఏర్పడే షడాష్టక యోగం వల్ల జాగ్రతగా ఉండాల్సిన రాశుల వారు ఎవరో చూద్దాం.
(2 / 4)
షడాష్టక యోగం వల్ల కర్కాటక రాశి వారికి ధన సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడవచ్చు. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అప్పు ఇవ్వడం మానుకోండి. లేకపోతే, డబ్బు తిరిగి రాదు. అనవసర ఖర్చులు రావచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడం మానుకోండి.
(3 / 4)
సింహ రాశి వారికి షడాష్టక యోగంతో పనిలో సమస్యలను ఎదుర్కొంటారు. శత్రువులు చాలా ఇబ్బంది పెడతారు. ఆరోగ్యం కొద్దిగా క్షీణించవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా మాట్లాడాలి.
(4 / 4)
ధనుస్సు రాశి వారికి షడాష్టక యోగంతో ఇబ్బందులు ఉంటాయి. ఈ కాలంలో ఈ రాశుల వారు కోపానికి దూరంగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొందరికి ఆర్థిక నష్టాలు రావచ్చు. వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు చేయవలసి రావచ్చు. (గమనిక : ఈ సమాచారం కేవలం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. పంచాంగాలు/జ్యోతిష్యం/ వివిధ మాధ్యమాల నుంచి సేకరించి కథనం ఇచ్చాం. ఏవైనా అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
ఇతర గ్యాలరీలు