(1 / 6)
ఈ ఏడాది జూన్ చివరి వారం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే జూన్ 26న అరుదైన, పవిత్రమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది. ఇది సుమారు 50 ఏళ్ల తర్వాత వస్తుంది. మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, బృహస్పతి, చంద్రుడు కలిసి ఉంటారు. దీంతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఈ నాలుగు రాశుల వారికి లాటరీ తగినట్లే ఉంటుంది. ఆస్తిపాస్తులు, సంపద, ఆర్థిక లాభాలు పెరగడంతోపాటు ప్రేమ, కుటుంబంలో సంతోషం ఉంటుంది.
(2 / 6)
వృషభ రాశి- చతుర్గ్రాహి యోగం వృషభ రాశి వారికి శుభ సంకేతాలను తెస్తుంది. ఈ సమయంలో ప్రజాదరణ పెరుగుతుంది. అలాగే, సమాజంలో మీకు చాలా ప్రాముఖ్యత లభిస్తుంది. కుటుంబ వ్యాపారం లేదా పూర్వీకుల ఆస్తి నుండి ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ సారి కెరీర్ పురోభివృద్ధికి, ఆదాయం పెరగడానికి మంచి అవకాశం ఉంది. ఇంట్లో శాంతి, పరస్పర సామరస్యం నెలకొంటాయి. అయితే, డబ్బును పొదుపు చేయడంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు.
(3 / 6)
మిథున రాశి- మిథున రాశి వారికి ఈ యోగం చాలా ప్రత్యేకం. వృత్తి, వ్యాపారాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. విద్యారంగంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వివాహమైన వారికి మంచి ప్రపోజల్ వస్తుంది. పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ సారి శుభవార్త. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులతో కనెక్ట్ అవుతారు.
(4 / 6)
సింహం- సింహ రాశి వారికి ఈ యోగం ఆర్థికంగా శుభ ఫలితాలను ఇస్తుంది. చాలా కాలంగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న వారికి ఇప్పుడు ఊరట లభించనుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ సమయం విద్య, ప్రేమ జీవితం, వైవాహిక విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి లేదా ఆస్తికి సంబంధించిన విషయాలలో సానుకూల నిర్ణయాలు తీసుకోవచ్చు. తోబుట్టువులతో సంబంధంలో మాధుర్యం ఉంటుంది.
(5 / 6)
తులా రాశి- తులా రాశి జాతకులకు ఈ సమయం ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు తీర్థయాత్రకు వెళ్లవచ్చు. మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా విజయం లభిస్తుంది. నిరంతర శ్రమ, సహనంతో ఉండండి. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉన్నత విద్య లేదా వృత్తికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు విజయవంతమవుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో సమతుల్యత, సామరస్యం ఉంటుంది.
(6 / 6)
పాఠకులకు గమనిక: ఈ సమాచారం జ్యోతిష లెక్కల ఆధారంగా అందించింది. ఇక్కడ రాసినవన్నీ రాబోయే రోజుల్లో నిజమవుతాయని కచ్చితంగా చెప్పలేం. జ్యోతిష్యానికి సంబంధించిన ఏవైనా ప్రశ్నలకు లేదా ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ప్రొఫెషనల్ జ్యోతిష్కుడిని సంప్రదించడం మంచిది.
ఇతర గ్యాలరీలు