ఈ రాశుల వారికి ఎదురుకానున్న క్లిష్ట పరిస్థితులు.. మరింత జాగ్రత్తగా ఉండాలి!
- తిరోగమన దిశలో ఉన్న కుజుడు త్వరలో రాశి మారనున్నాడు. ఈ దిశలోనే మిథున రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి ఇది ప్రతికూలంగా ఉండనుంది. వీరు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
- తిరోగమన దిశలో ఉన్న కుజుడు త్వరలో రాశి మారనున్నాడు. ఈ దిశలోనే మిథున రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి ఇది ప్రతికూలంగా ఉండనుంది. వీరు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
(1 / 5)
జ్యోతిషం ప్రకారం, ప్రస్తుతం కుజుడు (అంగారకుడు).. తిరోగమన దిశలో ఉన్నాడు. ఇది అన్ని రాశులపై ప్రభావం చూపుతోంది. అయితే, తిరోగమన దిశలో ఉన్న కుజుడు.. రాశి మారడం వల్ల కొన్ని రాశులకు క్లిష్ట కాలం ఎదురుకానుంది.
(2 / 5)
తిరోమన దిశలో ఉన్న కుజుడు మరో మూడు రోజుల్లో జనవరి 21వ తేదీన మిథున రాశిలో అడుగుపెట్టనున్నాడు. దీంతో మూడు రాశుల వారికి సమయం ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 24 వరకు కుజుడు తిరోగమనంలో ఉంటాడు. అప్పటి వరకు మూడు రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవేవంటే..
(3 / 5)
కుంభం: మిథునంలో కుజుడి తిరోగమనం కంభ రాశి వారికి ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెడుతుంది. ఈ కాలంలో వీరికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వాదనలకు దిగితే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
(4 / 5)
మీనం: ఈ కాలంలో మీనరాశి వారికి క్లిష్ట పరిస్థితులు ఎదురుకావొచ్చు. భార్యభర్తల మధ్య భేదాభిప్రాయాలు రావొచ్చు. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే సంయమనంగా ఆలోచించి ముందుకు సాగాలి. డబ్బు విషయంలో దుబారా కాకుండా చూసుకోవాలి.
(5 / 5)
వృషభం: మిథున రాశిలో కుజుడు తిరోగమనంలో సంచరించే కాలంలో వృషభ రాశి వారికి కొన్ని కష్టాలు ఎదురుకావొచ్చు. వీరికి ఆర్థికపరంగా అంత కలిసి రాదు. అందుకే ఆ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలో వాదనలు జరగొచ్చు. అందుకే వాగ్వాదాలు చేయకండి. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు