ఈవారంలోనే నక్షత్రం మారనున్న శుక్రుడు.. ఈ రాశులకు కలిసి రానున్న టైమ్.. చాలా ప్రయోజనాలు!
- శుక్రుడు ఈవారంలోనే నక్షత్రం మారనున్నాడు. పూర్వ భాద్రపద నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు. ఇది రాశులపై ప్రభావం చూపనుంది. మూడు రాశుల వారికి ఎక్కువ కలిసి రానుంది.
- శుక్రుడు ఈవారంలోనే నక్షత్రం మారనున్నాడు. పూర్వ భాద్రపద నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు. ఇది రాశులపై ప్రభావం చూపనుంది. మూడు రాశుల వారికి ఎక్కువ కలిసి రానుంది.
(1 / 5)
జ్యోతిషం ప్రకారం, శుక్రుడి సంచారం రాశులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. శుక్రుడు రాశి, నక్షత్రం మారడం ద్వారా జనాల అదృష్టాలు మారుతుంటాయి. శుక్రుడు ఈవారంలోనే నక్షత్రం మారనున్నాడు.
(2 / 5)
శుక్రుడు ఈ వారంలోనే జనవరి 17వ తేదీన ఉదయం 7.51 గంటలకు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు పూర్వ భాద్రపద నక్షత్రంలో శుక్రుడు సంచరిస్తాడు. దీనివల్ల మూడు రాశుల వారికి ఎక్కువ అదృష్టం ఉండనుంది.
(3 / 5)
వృశ్చికం: ఈ కాలంలో వృశ్చిక రాశి వారికి ఎక్కువ ప్రయోజనాలు దక్కుతాయి. వీరు చేసే పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ధనపరంగా లాభాలు సొంతం అవుతాయి. ఆస్తులు, వాహనాలు కొనేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
(4 / 5)
మకరం: ఈ నక్షత్ర మార్పు.. మకర రాశి వారికి శుభాలను తెచ్చిపెడుతుంది. ఈ కాలంలో వీరి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. పెండింగ్‍లో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
(5 / 5)
కుంభం: పూర్వ భాద్రపద నక్షత్రంలో శుక్రుడి సంచారం వల్ల కుంభ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమలో ఉన్న వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ధనపరంగా లాభాలు ఉంటాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ కథనం అందించాం. వీటికి కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు