లక్ష్మీ నారాయణ యోగం: ఈ మూడు రాశుల వారికి అదృష్టం, ధనం, గౌరవం!-these zodiac signs may get money luck benefits due to lakshmi narayana yogam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  లక్ష్మీ నారాయణ యోగం: ఈ మూడు రాశుల వారికి అదృష్టం, ధనం, గౌరవం!

లక్ష్మీ నారాయణ యోగం: ఈ మూడు రాశుల వారికి అదృష్టం, ధనం, గౌరవం!

Feb 01, 2025, 02:38 PM IST Chatakonda Krishna Prakash
Feb 01, 2025, 02:38 PM , IST

  • లక్ష్మీ నారాయణ యోగం ఇదే నెలలో ఏర్పడనుంది. దీనివల్ల మూడు రాశుల వారికి అధిక ప్రయోజనాలు కలుగుతాయి. అదృష్టం నుంచి గౌరవం వరకు లాభాలు ఉండే అవకాశం ఉంది.

జ్యోతిషం ప్రకారం, బుధుడు, శుక్రుడి సంచారాలకు ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది. అలాంటి ఈ రెండు రాశుల కలయిక రాశులపై ప్రభావాన్ని ఎక్కువ చూపుతుంది. ఒకే రాశిలో బుధుడు, శుక్రుల కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనుంది. 

(1 / 5)

శుక్రుడు మే 31వ తేదీ వరకు మీనరాశిలో సంచరించనున్నాడు. ఈనెల ఫిబ్రవరి 27న బుధుడు అదే మీనరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీంతో మీనంలో ఈ రెండు గ్రహాల కలయికతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. మే 7 వరకు మీనరాశిలో బుధుడు ఉంటాడు. ఈ యోగ కాలంలో మూడు రాశుల వారికి ఎక్కువగా ప్రయోజనాలు దక్కుతాయి. 

(2 / 5)

ధనస్సు: మీనరాశిలో లక్ష్మీ నారాయణ యోగం వల్ల ధనస్సు వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఈ కాలంలో ధనపరమైన లాభాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. మనశ్శాంతి కలుగుతుంది. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు వేతన పెంపు లాంటి ప్రయోజనాలు ఉండొచ్చు. 

(3 / 5)

మీనం: మీన రాశిలోనే లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనుంది. దీంతో ఈ రాశి వారికి కాలం కలిసి వస్తుంది. వీరికి ఆర్థిక విషయాల్లో ఎక్కువగా కలిసి వస్తుంది. వ్యాపారులకు లాభాలు పెరగొచ్చు. ఆధ్యాత్మిక చింతన అధికం అవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సుదీర్ఘంగా వాయిదాలు పడుతూ వస్తున్న కొన్ని పనులను ఈ కాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 

(4 / 5)

మిథునం: మీనంలో లక్ష్మీ నారాయణ యోగ కాలం మిథున వాశి వారికి శుభప్రదం. ఈకాలంలో వీరికి ధన లాభాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ప్రతిష్ట పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులకు సహచరుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు