అరుదైన యోగం: ఈ మూడు రాశుల వారికి అదృష్టం, లాభాలు!
- రానున్న అమావాస్య రోజు అరుదైన త్రివేణి యోగం ఏర్పడనుంది. దీనివల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం మెండుగా ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- రానున్న అమావాస్య రోజు అరుదైన త్రివేణి యోగం ఏర్పడనుంది. దీనివల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం మెండుగా ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
పుష్య మాసం ఆఖరి రోజున వచ్చే అమావాస్యను మౌనీ అమవాస్య అంటారు. దీన్నే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి 29వ తేదీన మౌనీ అమావాస్య వచ్చింది.
(2 / 5)
మౌనీ అమావాస్య ఉన్న జనవరి 29వ తేదీన అరుదైన త్రివేణి యోగం ఏర్పడనుంది. మకరరాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడి కలయిక వల్ల ఆరోజున త్రివేణి యోగం ఏర్పడుతుంది. త్రిగ్రాహి యోగం కూడా అదే రోజున ఉండనుంది. మౌనీ అమావాస్య రోజున ఏర్పడే త్రివేణి యోగం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉండనుంది.
(3 / 5)
మకరం: మకరరాశి వారికి త్రివేణి యోగం చాలా మేలు చేస్తుంది. ఈ రాశిలోనే యోగం ఏర్పడనుంది. ఈ యోగం ప్రభావంతో వీరికి విజయసిద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో కలిసి వస్తుంది. గౌరవం ఎక్కువగా దక్కుతుంది.
(4 / 5)
వృషభం: త్రివేణి యోగం.. వృషభ రాశి వారికి శుభప్రదం. ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది. సహచరుల మద్దతు లభిస్తుంది. చేసే పనికి ప్రశంసలు దక్కొచ్చు. ఆర్థికంగానూ సానుకూల పరిస్థితులు ఉంటాయి. పెండింగ్‍లో ఉన్న కొన్ని పనులు పూర్తి కావొచ్చు. ఆధాత్మిక చింతన పెరగొచ్చు.
(5 / 5)
కర్కాటకం: కర్కాటక రాశి వారికి త్రివేణి యోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వ్యాపారులకు ధనపరంగా లాభం ఉంటుంది. సమయం సంతోషంగా గడుపుతారు. ఇతరుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. చేసే పనుల్లో ఎక్కువ విజయవంతం అవుతాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు