ఈ మూడు రాశులకు గుడ్‍టైమ్ షురూ.. అన్నింటా అదృష్టం!
- బుధాదిత్య రాజయోగం మొదలైంది. సూర్యుడు, బుధుడి కలయికతో ఈ యోగం ఏర్పడింది. దీనివల్ల మూడు రాశుల వారికి మంచి టైమ్ షురూ అయింది.
- బుధాదిత్య రాజయోగం మొదలైంది. సూర్యుడు, బుధుడి కలయికతో ఈ యోగం ఏర్పడింది. దీనివల్ల మూడు రాశుల వారికి మంచి టైమ్ షురూ అయింది.
(1 / 5)
జ్యోతిషం ప్రకారం, సూర్యుడు, బుధుడు కలయికకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెండు గ్రహాలు నేడు కుంభ రాశిలో కలిశాయి. దీంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడింది.
(2 / 5)
కుంభ రాశిలోకి బుధుడు ఫిబ్రవరి 11న అడుగుపెట్టాడు. సూర్యుడు నేడు (ఫిబ్రవరి 12) అదే రాశిలో ప్రవేశించాడు. దీంతో కుంభ రాశిలో బుధుడు, సూర్యుడు కలవడంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఫిబ్రవరి 27 వరకు ఈ యోగం ఉండనుంది. ఈ కాలంలో మూడు రాశుల వారికి లక్ ఎక్కువగా ఉంటుంది.
(3 / 5)
వృశ్చికం: బుధాదిత్య రాజయోగ కాలంలో వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ కాలంలో ఆస్తులు కొనాలనుకునే వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభాలు అధికం అవుతాయి. కుటుంబంలో బంధాలు మరింత బలోపేతం అవుతాయి. ఉద్యోగులకు కూడా సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
(4 / 5)
మిథునం: కుంభంలో బుధాదిత్య యోగం వల్ల మిథున వారికి శుభాలు కలుగుతాయి. వీరికి ఈ కాలంలో అదృష్టం మద్దుతుగా ఉంటుంది. చేసే ఎక్కువ పనుల్లో విజయాలు సిద్ధిస్తాయి. కుటుంబంతో విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం ఎక్కువవుతుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.
(5 / 5)
కుంభం: బుధాదిత్య రాజయోగం ఇదే రాశిలో ఏర్పడనుంది. దీంతో కుంభ రాశి వారికి ఈ కాలం ఫలప్రదంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడుల నుంచి మంచి రాబడి దక్కొచ్చు. సమాజంలో గౌరవం అధికం అవుతుంది. ధనపరమైన విషయాల్లో కలిసి వస్తుంది. కుటుంబం నుంచి చాలా విషయాల్లో మద్దతు ఎక్కువగా ఉంటుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు