ఈవారంలో రెండు గ్రహాల సంచారాల్లో మార్పు.. ఈ 4 రాశుల వారికి బంపర్ లక్.. డబ్బు సహా అనేక విషయాల్లో ప్రయోజనాలు!-these zodiac signs may get benefits due to jupiter and sun changers in this week ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈవారంలో రెండు గ్రహాల సంచారాల్లో మార్పు.. ఈ 4 రాశుల వారికి బంపర్ లక్.. డబ్బు సహా అనేక విషయాల్లో ప్రయోజనాలు!

ఈవారంలో రెండు గ్రహాల సంచారాల్లో మార్పు.. ఈ 4 రాశుల వారికి బంపర్ లక్.. డబ్బు సహా అనేక విషయాల్లో ప్రయోజనాలు!

Published May 14, 2025 01:48 PM IST Chatakonda Krishna Prakash
Published May 14, 2025 01:48 PM IST

ఈవారంలో రెండు గ్రహాల సంచారాల్లో మార్పులు జరగనున్నాయి. రాశులను మారనున్నాయి. ఇది నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది. ఆ వివరాలు ఇవే.

ఈ వారంలో గురువు, సూర్యుడు రాశులను మారనున్నారు. నేడు మే 14న మిథున రాశిలోకి గురువు (బృహస్పతి) ప్రవేశించనుండగా.. మరుసటి రోజు మే 15వ తేదీన మేషాన్ని వీడి వృషభ రాశిలోకి సూర్యుడు అడుగుపెడతాడు. అక్టోబర్ 18 వరకు మిథునంలో గురువు, జూన్ 15 వరకు వృషభంలో సూర్యుడు సంచరిస్తారు. కాగా, ఈ వారంలో ఈ రెండు మార్పుల వల్ల 4 రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. లాభాలు ఉంటాయి.

(1 / 5)

సింహం: ఈవారంలో గురువు, సూర్యుడు రాశులు మారడం వల్ల సింహ రాశి వారికి మంచి టైమ్ మొదలవుతుంది. వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ధనపరమైన విషయాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తిగా ఉంటారు. ముఖ్యంగా వృషభంలో సూర్యుడి సంచారం వీరికి ఎక్కువ మంచి చేస్తుంది.

(2 / 5)

ధనస్సు: ఈ రెండు మార్పుల వల్ల ధనూ రాశి వారికి ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. జీతాల పెరుగుదల, ప్రమోషన్లు పెండింగ్‍లో ఉన్న వారికి ఈ కాలంలో మంజూరయ్యే ఛాన్స్ ఉంది. వీరికి ఆత్మవిశ్వాసం కూడా మెండుగా ఉంటుంది. సమాజంలో గౌరవం అధికమవుతుంది.

(3 / 5)

తుల: గురువు, సూర్యుడు రాశులు మారుతుండడం తులా రాశి వారికి కలిసొచ్చే సమయాన్ని తీసుకొస్తుంది. వీరు అన్ని పనులను పూర్తి నమ్మకంతో చేస్తారు. దీంతో ఎక్కువ విషయాల్లో సక్సెస్ అవుతారు. ఆర్థికపరంగా ప్రయోజనాలు ఎక్కువగా కలుగుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పెట్టుబడుల నుంచి రాబడి మెరుగ్గా ఉండొచ్చు.

(4 / 5)

మేషం: గురువు, సూర్యుడు ఒకే వారం ఒక రోజు వ్యవధిలో రాశులు మారడం వల్ల మేషరాశి వారికి అదృష్టం బాగా ఉంటుంది. వీరికి దశ మారుతుంది. వ్యాపారులు, ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొత్త వ్యక్తులతో జరిగే పరిచయం కూడా లాభిస్తుంది. వ్యక్తిగత సంతోషంపై దృష్టి పెడతారు. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.(జ్యోతిషంలో సూర్యుడిని గ్రహంగా పరిగణిస్తారు.) (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం రూపొందించాం. ఇవి అంచనాలు మాత్రమే. కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాలను తీర్చుకునేందుకు, వ్యక్తిగత ప్రభావాలను తెలుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు