Planet Transit : మూడు గ్రహాల సంచారంతో ఈ రాశులకు బ్యాడ్ లక్.. చాలా జాగ్రత్తగా ఉండాలి!
- Planet Transit in September : సెప్టెంబర్‌లో 3 ప్రధాన గ్రహాలు సంచరిస్తున్నాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు రాశి మారుతున్నారు. దీనితో కొన్ని రాశులపై ప్రభావం పడనుంది.
- Planet Transit in September : సెప్టెంబర్‌లో 3 ప్రధాన గ్రహాలు సంచరిస్తున్నాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు రాశి మారుతున్నారు. దీనితో కొన్ని రాశులపై ప్రభావం పడనుంది.
(1 / 5)
బుధుడు సెప్టెంబర్ 4న కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తాడు. సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 18న శుక్రుడు కన్యారాశి నుండి తులారాశికి ప్రయాణిస్తాడు. సెప్టెంబర్ 4న బుధాదిత్య యోగం ఉంది. బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 16 వరకు సూర్యుడు కూడా సింహరాశిలో ఉండటం వల్ల బుధాదిత్య యోగం కలుగుతుంది. ఈ గ్రహాల గమనం కొన్ని రాశులకు అనుకూలంగా ఉండదు. ఈ గ్రహాల సంచారం కారణంగా వీరికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి.
(2 / 5)
కర్కాటక రాశివారు ఈ నెల ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ నెల మధ్యలో మీరు వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో మీ పని కార్యకలాపాలలో చాలా అడ్డంకులు ఉండవచ్చు. మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ కాలంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది.
(3 / 5)
మిధున రాశి గ్రహాల స్థానం కారణంగా జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవలసి రావచ్చు. అదే సమయంలో ఈ నెలలో సూర్యుడు మాతృభూమిగా పిలువబడే నాల్గో ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. ఈ కాలంలో ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ కాలంలో ఆర్థిక వ్యయం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
(4 / 5)
కన్యా రాశి మధ్యలో సూర్యుడు మీ లగ్న గృహంలోకి ప్రవేశించినప్పుడు, మీలో కోపం, అహం పెరగవచ్చు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఉండవచ్చు. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త వహించండి.
ఇతర గ్యాలరీలు