ఈ నాలుగు రాశుల వారికి మంచి టైమ్ మొదలైంది.. లక్, ధనం, విజయాలు సిద్ధిస్తాయి!
- బుధుడు రాశి మారాడు. దీంతో నాలుగు రాశుల వారికి గుడ్ టైమ్ మొదలైంది. వీరికి చాలా ప్రయోజనాలు దక్కనున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- బుధుడు రాశి మారాడు. దీంతో నాలుగు రాశుల వారికి గుడ్ టైమ్ మొదలైంది. వీరికి చాలా ప్రయోజనాలు దక్కనున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
గ్రహాల రాకుమారుడిగా పిలుచుకునే బుధుడు.. మకర రాశిలోకి ప్రవేశించాడు. శనివారం (జనవరి 24) సాయంత్రం మకరరాశిలోకి బుధుడు అడుగుపెట్టాడు. ఫిబ్రవరి 11వ తేదీ మధ్యాహ్నం వరకు మకరరాశిలోనే బుధుడు సంచరిస్తాడు. దీంతో నాలుగు రాశుల వారికి దశ తిరిగింది. వీరికి అదృష్టం మెండుగా ఉంటుంది. ఆ రాశులు ఏవంటే..
(2 / 5)
కర్కాటకం: మకరంలో బుధుడు అడుగుపెట్టడంతో కర్కాటక రాశి వారికి మంచి సమయం మొదలైంది. ఈ కాలంలో వీరికి చాలా విషయాల్లో ప్రయోజనాలు దక్కుతాయి. అదృష్టం మద్దతు ఉంటుంది. డబ్బు పరమైన అంశాల్లో లాభాలు కలిగే అవకాశం ఉంది. వీరి ప్లాన్‍లు సక్సెస్ అయ్యే ఛాన్సులు అధికం. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
(3 / 5)
మేషం: ఈ కాలంలో మేష రాశి వారికి కూడా ఎక్కువగా కలిసి వస్తుంది. వీరి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ధనపరమైన విషయాల్లో వ్యాపారులు, ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరగొచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఫలితం దక్కొచ్చు.
(4 / 5)
మీనం: ఈ కాలం మీనరాశి వారికి లాభదాయకం. చాలా కాలం నుంచి పెండింగ్‍లో ఉన్న కొన్ని పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు, కొత్త ఒప్పందాలు దక్కే అవకాశాలు ఎక్కవ. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయం గడుపుతారు. సపోర్ట్ బాగా ఉంటుంది.
(5 / 5)
వృషభం: మకర రాశిలో బుధుడి సంచారం వృషభ రాశి వారికి శుభాలను కలుగజేస్తుంది. ఉద్యోగులకు సహచరుల నుంచి మద్దతు, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. (గమనిక: నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు