ఈనెల చివరి వారంలో ఈ రాశుల దశ తిరగనుంది.. ఆర్థికంగా మెరుగుదల, సంతోషం!-these zodiac signs luck may luck change and to get benefits due to venus transit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈనెల చివరి వారంలో ఈ రాశుల దశ తిరగనుంది.. ఆర్థికంగా మెరుగుదల, సంతోషం!

ఈనెల చివరి వారంలో ఈ రాశుల దశ తిరగనుంది.. ఆర్థికంగా మెరుగుదల, సంతోషం!

Jan 08, 2025, 05:03 PM IST Chatakonda Krishna Prakash
Jan 08, 2025, 05:03 PM , IST

  • శుక్రుడు.. ఈ జనవరి నెల చివరి వారంలో రాశి మారనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారి దశ తిరగనుంది. అదృష్టం ఎక్కువగా ఉంటుంది. ఆ రాశులు ఏవో ఇక్కడ చూడండి.

శుక్రుడి సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. జ్యోతిషం ప్రకారం.. ఐశ్వర్యం, లాభాలు, సుఖాలకు శుక్రుడు కారకుడు. అందుకే శుక్రుడి సంచారం రాశులపై ఎక్కువగానే కనిపిస్తుంది. 

(1 / 5)

శుక్రుడు ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ నెల చివరి వారంలో జనవరి 28వ తేదీన ఉదయం 7.12 గంటలకు మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. జనవరి 28 నుంచి మే 31వ తేదీ వరకు మీనరాశిలోనే శుక్రుడు సంచరించనున్నాడు. ఈ కాలంలో మూడు రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉండనుంది. 

(2 / 5)

కర్కాటం: మీనంలో శుక్రుడు సంచరించనున్న కాలం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. పెండింగ్ పనులు పూర్తయ్యే ఛాన్స్ ఎక్కువ. చాలా విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది.

(3 / 5)

వృషభం: ఈ కాలంలో వృషభ రాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్యామిలీతో, స్నేహితులతో సంతోషంగా సమయం గడుపుతారు. వ్యాపారులకు ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. వాయిదా వేస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. 

(4 / 5)

మిథునం: మీనరాశిలో శుక్రుడు సంచరిచడం మిథున రాశి వారికి లాభదాయకం. కొందరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఆనందంగా ఉంటారు. (గమనిక: నమ్మకాలు, శాస్తాల ఆధారంగా ఈ సమాచారం రూపొందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు