(1 / 5)
సూర్యుడు ప్రస్తుతం మేషరాశి సంచరిస్తున్నాడు. మే 15వ తేదీ అర్ధరాత్రి వరకు అదే రాశిలో ఉంటాడు. మే 15 అర్ధరాత్రి 12.20 గంటలకు వృషభంలోకి అడుగుపెడతాడు. అంటే మే నెలలో ఇంకా తొలి రెండు వారాల పాటు మేషరాశిలోనే సూర్యుడు సంచరిస్తాడు. ఈకాలంలో నాలుగు రాశుల వారికి అదృష్టం కొనసాగుతుంది. చాలా విషయాల్లో కలిసి వస్తుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(2 / 5)
సింహం: మేషరాశిలో సూర్యుడు మరో రెండు వారాలు సంచరించనుండంతో ఆ కాలంలో సింహ రాశి వారికి శుభాలు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో లాభాలు ఉంటాయి. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి సత్ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు మొదలుపెట్టేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఏవైనా గొడవలు ఉంటే పరిష్కారం కావొచ్చు. ప్రశాంతత నెలకొంటుంది.
(3 / 5)
మిథునం: మేషంలో సూర్యుడు సంచరించే కాలం మిథున రాశి వారికి అదృష్టం ఉంటుంది. చాలా పనుల్లో సక్సెస్ అవుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి పరిస్థితులు కలిసి వస్తాయి. తోబుట్టువులతో ఉండే విభేదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో వీరు ఆరోగ్యం విషయంలో ఎక్కువ మరింత శ్రద్ధ వహించాలి.
(4 / 5)
కర్కాటకం: మేషరాశిలో సూర్యుడు సంచారం వల్ల కర్కాటక రాశి వారికి గుడ్‍టైమ్ కొనసాగుతుంది. ఈ కాలంలో వీరికి అదృష్టం మద్దతు ఎక్కువగా లభిస్తుంది. ఇతరులతో ప్రశంసలు పొందుతారు. కొందరు ఉద్యోగులకు వేతనాలు పెరగొచ్చు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
(5 / 5)
ధనస్సు: మేషరాశిలో సూర్యుడు సంచరించడం ధనూ (ధనస్సు) రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. డబ్బు ఆదా చేయడం గురించి ఆలోచిస్తారు. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల నుంచి రాబడి మెరుగ్గా ఉండే ఛాన్స్ ఉంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల అనుసారం ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)
ఇతర గ్యాలరీలు