
(1 / 8)
ఈ సంవత్సరం దీపావళి, అశ్విని అమావాస్య వేళ అత్యంత అరుదైన మూడు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయం నుంచే కార్తీక మాసం ప్రారంభం కానుంది. తుల రాశిలోకి చంద్రుడి సంచారంతో అమృత సిద్ధి యోగం, కన్యారాశిలోకి శుక్రుడి స్థాన చలనంతో శుక్రాదిత్య యోగం ఏర్పడనున్నాయి.

(2 / 8)
వీటితోపాటు సర్వార్ధ సిద్ధి యోగం కూడా ఏర్పడనుంది. ఈ మూడు శుభప్రదమైన యోగాలతో ఐదు రాశుల వారికి తలరాత మారనుంది. మరి వారికి కలిగే లాభాలు, ఆ ఐదు రాశులు ఏంటో లుక్కేద్దాం.

(3 / 8)
ఈ సంవత్సరం కుంభ రాశి వారికి గణనీయమైన లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. కెరీర్ పరంగా ప్రమోషన్స్, ఆర్థికంగా మెరుగైన లాభాలు, విదేశీ ప్రయాణం చేయనున్నారు. ఊహించని బహుమతి, ఉద్యోగులకు శుభవార్తలు వినిపిస్తాయి.
(pixabay)
(4 / 8)
ఈ అరుదైన శుభ యోగాల వల్ల వృశ్చిక రాశి వారి జీవితం సంతోషమయంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు, ప్రత్యేక బహుమతి, నిరుద్యోగులకు ఉద్యోగం, శుభవార్తలు అందుకోనున్నారు.

(5 / 8)
మకర రాశి వారికి ఈ సమయంలో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు కోరుకున్న చోటుకు బదిలీ అవుతారు. సమాజంలో గౌరవం, ఉద్యోగులకు ప్రశంసలు, వ్యాపారులకు కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది.
(Pixabay)
(6 / 8)
కన్యా రాశి వారికి శుభం జరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం, విదేశీ యాత్రలు, అవివాహితులకు పెళ్లి ప్రతిపాదనలు జరిగనున్నాయి. జీవిత భాగస్వామితో మధురంగా గడుపుతారు.

(7 / 8)
వృషభ రాశి వారికి దీపావళి వేళ శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో ప్రేమ, సంతోషం వెల్లివిరిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉండటంతోపాటు ఆర్థికంగా లాభాలు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
(Freepik)
(8 / 8)
నోట్: ఈ నివేదికలోని సమాచారం వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన కచ్చితత్వాన్ని హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ధ్రువీకరించలేదని గమనించగలరు.
ఇతర గ్యాలరీలు