(1 / 6)
జ్యోతిష్య శాస్త్రం అనేక విషయాల గురించి చెబుతుంది. గొడవలు, ప్రేమ, పెళ్లి.. ఇలా అనేక అంశాల గురించి వివరిస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే కొన్ని రాశులవారు చాలా రొమాంటిక్‌గా ఉంటారట. ఆ రాశులు ఏంటో చూద్దాం..
(2 / 6)
తులారాశికి అధిపతి శుక్రుడు, ఆయన చాలా శృంగారభరితంగా ఉంటాడని, సంబంధాలపై చాలా శ్రద్ధ చూపుతాడని కూడా చెబుతారు. తులారాశి వారు కూడా చాలా రొమాంటిక్‌గా ఉంటారట. తమ భాగస్వామి కూడా అంతే రొమాంటిక్‌గా ఉండాలని కోరుకుంటారు. జీవిత భాగస్వామికి సర్ ప్రైజ్ ఇవ్వడం చాలా ఇష్టం.
(3 / 6)
కర్కాటక రాశి వారు తమ ప్రేమలో స్థిరంగా ఉంటారు. తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. బయటి ప్రపంచానికి కూడా తమ ప్రేమను ఎక్కువగా చూపిస్తారు.
(4 / 6)
మీన రాశి వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఈ రాశికి భాగస్వామి లభిస్తే, వారు తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. వారిని బాగా చూసుకుంటారు. భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. మరో మాటలో చెప్పాలంటే భాగస్వామే ప్రపంచంగా బతుకుతారు.
(5 / 6)
(6 / 6)
వృషభ రాశి వారు కూడా తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. నిబద్ధతతో ఉంటారు, రిలేషన్‌షిప్‌లో చాలా సీరియస్ అయితే చాలా పట్టుదలతో ఉంటారు. (గమనిక : ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా కథనం ఇచ్చాం. HT Telugu ఈ కంటెంట్‌కు ఎలాంటి బాధ్యత వహించదు.)
ఇతర గ్యాలరీలు