
(1 / 6)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాల్లో బృహస్పతి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. అక్టోబర్ 18న రాత్రి సమయంలో కర్కాటక రాశిలోకి గురుడు సంచరించి హంస మహాపురుష యోగం ఏర్పరచనున్నాడు. కర్కాటక రాశిలో సుమారు 49 రోజుల పాటు అంటే డిసెంబర్ 5 మధ్యాహ్నం వరకు కుజుడు ఉండనున్నాడు. దీని ద్వారా ఈ నాలుగు రాశుల వారికి తలరాత మారనుంది. వారెవరో చూద్దాం.

(2 / 6)
కర్కాటక రాశి: గురుడి సంచారంతో కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. హంస రాజయోగంతో వీరి ఆత్మవిశ్వాసం పెరగనుంది. సమాజంలో గౌరవంతోపాటు వ్యాపారులు అధిక లాభాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించగా ఉద్యోగులకు కెరీర్‌లో పురోగతి లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
(Pixabay)
(3 / 6)
వృశ్చిక రాశి: సానుకూల ఫలితాలు ఉంటాయి. అనేక రంగాల్లో విజయం, మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి, ఆహ్లాదకరమైన ప్రయాణాలు వంటివి ఉంటాయి. వ్యాపారవేత్తలకు మెరుగైన ఫలితాలు, కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

(4 / 6)
తులా రాశి: ఈ రాశి వారికి ఈ సమయంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. హంసయోగం ప్రభావంతో అనేక రంగాల్లో విజయం, ఉద్యోగలకు ప్రమోషన్, కొత్త బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారులకు లాభాలు, ఆర్థిక పరంగా ప్రయోజనాలు, ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది.

(5 / 6)
మేష రాశి: హంస మహాపురుష రాజయోగంతో ఈ రాశి వారికి తలరాత మారనుంది. ఉద్యోగులకు పురోగతి, విదేశాల్లో పని చేయాలన్న కోరికలు నెరవేరుతాయి. కుటుంబం, వైవాహిక జీవతం సంతోషంగా ఉంటుంది. వ్యాపారస్థులకు అనేక లాభాలు, మెరుగైన ప్రయోజనాలు పొందనున్నారు.

(6 / 6)
గమనిక: ఈ నివేదిక కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎలాంటి కచ్చితత్వాన్ని ధ్రువీకరించలేదని గమనించగలరు.
ఇతర గ్యాలరీలు