(1 / 5)
జ్యోతిషం ప్రకారం, శుక్రుడి సంచారం రాశులపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. రాక్షసుల గురువుగా పరిగణించే శుక్రుడి కదలికలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి శుక్రుడు వచ్చే నెల ఏప్రిల్ మొదట్లో నక్షత్రం మారనున్నాడు.
(Pixabay)(2 / 5)
ఏప్రిల్ 1వ తేదీన పూర్వ భాద్రపద నక్షత్రంలోకి శుక్రుడు అడుగుపెట్టనున్నాడు. ఏప్రిల్ 26వ తేదీ వరకు అదే నక్షత్రంలో శుక్రుడు సంచరిస్తాడు. పూర్వ భాద్రపదతో శుక్రుడు సంచరించే కాలం మూడు రాశుల వారికి ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. వీరి దశ మారుతుంది.
(3 / 5)
మకరం: పూర్వ భాద్రపద నక్షత్రంలో శుక్రుడు సంచరించే కాలం మకరరాశి వారికి చాలా కలిసి వస్తుంది. వీరికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. చాలా అంశాల్లో అదృష్టం కలిసి వస్తుంది. పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారులకు ఆర్థిక లాభాలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత బలపడతాయి.
(4 / 5)
కుంభం: ఈ కాలంలో కుంభరాశి వారికి సంతోషం ఎక్కువగా కలుగుతుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు డబ్బు విషయాల్లో కలిసి వస్తుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. కొందరికి జీతాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సమాజంలో గౌరవం అధికమవుతుంది. ప్రేమలో ఉన్న వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.
(5 / 5)
వృషభం: పూర్వ భాద్రపద నక్షత్రంలో శుక్రుడు సంచరించడం వృషభ రాశి వారికి శుభప్రదం. వీరికి లక్ మద్దతుగా ఉంటుంది. ఈ కాలంలో కొత్త అవకాశాలు దక్కుతాయి. నూతన వ్యక్తులతో పరిచయం లాభిస్తుంది. గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పనిపై ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయాల్లో ప్రశంసలు అందుకుంటారు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల అనుసారం ఈ సమాచారం రూపొందించాం. ఇవి అంచనాలు మాత్రమే. కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు